Homeతెలంగాణబీజేపీలో ఏం జరుగుతోంది!

బీజేపీలో ఏం జరుగుతోంది!

•కనిపించని మునుపటి ఉత్సాహం
•బండి సంజయ్ కుమారుడి వివాదంతో అంతా సైలెన్స్
•రోజురోజుకు నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు
•ఇలా అయితే గ్రేటర్ ఎన్నికల్లో కష్టం
•ఆందోళనలో క్యాడర్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:-తెలంగాణ బిజెపిలో వింత వైఖరి కొనసాగుతోంది. పైకి అంత బాగానే ఉన్నా.. లోలోపల మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంది. నేతల మధ్య విభేదాలు పతాకస్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో పాత తరం నేతలు.. వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పైకి మాత్రం ఆల్ ఈజ్ వెల్ అన్నట్టు ఉంది. బిజెపికి ఎనిమిది మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆపై పేరు మోసిన నేతలు ఉన్నారు. మంచి నెట్వర్క్ కూడా ఉంది. కానీ నేతల మధ్య విభేదాలు పార్టీకి భారీగా డామేజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

బండి సంజయ్ కు దక్కని అండ..
ప్రస్తుతం తెలంగాణ బిజెపికి బండి సంజయ్ కుమారుడి వివాదం కుదిపేస్తోంది. అయితే ఈ విషయంలో బండి సంజయ్ కు అండగా నిలిచిన వారు బిజెపిలో లేకుండా పోతున్నారు.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఒక్కరే ముందుకు వచ్చి బండి సంజయ్ కు అండగా నిలిచారు. అందులో బండి సంజయ్ తప్పు ఏమి ఉందని ప్రశ్నించారు. అయితే కనీసం మీడియా ముందుకు వచ్చి నేతలు స్పందించడం లేదు. కానీ లోలోపల ఆనంద పడుతున్న వారు ఉన్నారు.. అయితే బండి సంజయ్ కుటుంబ వివాదం కావచ్చు. కానీ అదే సంజయ్ తెలంగాణలో బిజెపి కి ఊపు తెచ్చే నాయకుడు అన్న విషయాన్ని మాత్రం ఆ పార్టీ నేతలు మరిచిపోయారు. బండి సంజయ్ నాయకత్వాన్ని ఇష్టం లేని చాలామంది బిజెపి నేతలు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

స్థానిక ఎన్నికల్లో దక్కని ఫలితం..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి వెనుకబాటుకు నేతల మధ్య విభేదాలే కారణమని తెలుస్తోంది. పంచాయితీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఆ పార్టీకి దక్కింది చాలా చిన్న విజయం. నేతలు సరిగ్గా పనిచేయకపోవడం వల్లే 2024 సార్వత్రిక ఎన్నికల ఊపు కొనసాగడం లేదని అర్థం అవుతోంది. మొన్న ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన తర్వాత కూడా పార్టీని బలోపేతం చేసే ప్రణాళిక ఏది బిజెపిలో కనిపించలేదు. మునుపటి ఉత్సాహం తగ్గింది పార్టీలో. ఇలా అయితే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం అనుమానమే.

ప్రధాని పిలుపునిచ్చినా
మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల తో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. ఒక విధంగా ఇవి సెమీఫైనల్స్ లాంటివి. కచ్చితంగా ఈ ఎన్నికల్లో సత్తా చాటితేనే తెలంగాణలో బిజెపి రేసులో నిలిచేది. ఏ మాత్రం వెనుకబడిన అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలు తప్పుతాయి. మరోవైపు రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. గులాబీ పార్టీ సైతం గ్రామీణ ప్రాంతాల్లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ స్థాయి దూకుడు బిజెపిలో కనిపించకపోవడం ఒక లోటు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు