భారత క్రికెట్ దిగ్గజం సచిన టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో తనపై జరిగిన బాడీ షేమింగ్ ఘటనపై తీవ్రంగా స్పందించింది. ఆమెను, తన సోదరుడి భార్యను ఉద్దేశిస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
సారాను బాడీ షేమింగ్ చేసిన నెటిజన్!
ఇటీవల ఒక సోషల్ మీడియా అకౌంట్లో సారా, ఆమె సోదరుడి భార్య కలిసి నడుస్తూ వెళ్తున్న వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోకు సంబంధించిన క్యాప్షన్‌లో వారిపై అవమానకరంగా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సారా శరీరాకృతిని ఉద్దేశించి చేసిన కామెంట్లు వివాదానికి దారితీశాయి. ఈ వీడియో, వ్యాఖ్యలు సారా దృష్టికి చేరడంతో ఆమె నేరుగా స్పందించింది. సారా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆ పోస్టు స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ అసహనం వ్యక్తం చేసింది. “ఇలాంటి కామెంట్లు చాలా అసహ్యంగా ఉన్నాయి. ఇది జర్నలిజం కాదు. మమ్మల్ని ప్రశాంతంగా జీవించనివ్వండి” అంటూ పోస్టు పెట్టింది. సదరు వ్యక్తి పోస్ట్ ను తర్వాత డిలీట్ చేసినా, చేసిన తప్పు మాయమవదని కూడా ఆమె వ్యాఖ్యానించింది.
సారాకు సపోర్టుగా సెలెబ్రిటీల కామెంట్స్
ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. చాలామంది నెటిజన్లు సారాకు మద్దతుగా స్పందిస్తున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు, వారి రూపురేఖలపై ఇలా కామెంట్లు చేయడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కోసం కొందరు హద్దులు దాటుతున్నారని విమర్శిస్తున్నారు. ఇటీవల సెలబ్రిటీలపై బాడీ షేమింగ్ ఘటనలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు వ్యక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని, సోషల్ మీడియా వేదికల్లో బాధ్యతతో వ్యవహరించాలని నెటిజన్లు సూచిస్తున్నారు.
సారా టెండూల్కర్ స్పందన తర్వాత ఈ విషయం మరింత వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో అనేక పోస్టులు కనిపిస్తున్నాయి.