HomeతెలంగాణiBomma: మళ్లీ ఐ బొమ్మ...! నెట్టింట సైట్ హల్ చల్ ...

iBomma: మళ్లీ ఐ బొమ్మ…! నెట్టింట సైట్ హల్ చల్ …

  • కొత్త సినిమాలు ప్రత్యక్షం

  • ఆందోళనలో తెలుగు చిత్ర పరిశ్రమ

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమను మరోసారి పైరసీ భూతం వెంటాడుతోంది. ఒకవైపు డిజిటల్ విప్లవం.. మరోవైపు పైరసీతో చిత్ర పరిశ్రమ కుదేలు అవుతోంది. తాజాగా మరోసారి ‘ఐ బొమ్మ’ నెట్టింట ప్రత్యక్షం కావడం సంచలనంగా మారింది. ఈ సైట్ నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రవి అరెస్టు కావడంతో ఇక ఐ బొమ్మ ముగిసిన అధ్యయమని అంతా భావించారు. ఈ కేసులో నిందితుడు రవి బెయిల్ పై విడుదలైన కొద్ది రోజులకే ఆన్లైన్ లో మళ్లీ ఈ సైట్ ప్రత్యక్షం కావడం తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది.

నిర్వాహకుడి అరెస్టుతో…

తెలుగు చిత్ర పరిశ్రమకు ఐ బొమ్మతో భారీ దెబ్బ తగిలింది. సినిమాలు విడుదలైన మరుక్షణం ఈ సైట్లో ప్రత్యక్షం అయ్యేవి. దీనిపై సినీ ప్రముఖుల విజ్ఞప్తి మేరకు, ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు ఐ బొమ్మ సైట్ నిర్వాహకుడిగా భావిస్తున్న రవిని అరెస్టు చేశారు. దీంతో సినీ నిర్మాతలంతా ఊపిరి పీల్చుకున్నారు. అప్పట్లో సైట్ పూర్తిగా నిలిచిపోయింది కూడా. కానీ తాజాగా మరోసారి పునరుద్ధరించబడింది. ఇప్పటికే థియేటర్లలో ఆడుతున్న చిత్రాలు సైతం ఆ సైట్లో కనిపించడం ప్రారంభించాయి. రవి బెయిల్ పై రావడం. వెంటనే సైట్ ఆపరేషన్లు ప్రారంభం కావడం వెనుక ఉన్న నెట్వర్క్ ను చేదించడం ఇప్పుడు పోలీసులకు సవాల్ గా మారింది. అత్యాధునిక టెక్నాలజీతో డొమైన్లను మారుస్తూ వస్తున్న ఈ పైరసీ ముఠాను అరికట్టడంలో పోలీస్ శాఖ విఫలమవుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

థియేటర్ల నిర్వహణ కష్టం…

ఇప్పటికే థియేటర్ల నిర్వహణకు సంబంధించిన సంక్షోభం చిత్ర పరిశ్రమలో ఉంది. దానికి తోడు ఇప్పుడు పైరసీ వెంటాడుతోంది. ఇలా అయితే థియేటర్ల మనుగడ కష్టమని చిత్ర పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కోవిడ్ తర్వాత ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. ఓటిటి సంస్కృతితో థియేటర్లకు వచ్చి సినిమాలు చూసేవారు తక్కువయ్యారు. ఏదో పండగల సమయంలో మాత్రం థియేటర్లలో జనాలు కనిపిస్తున్నారు. అయితే ఐ బొమ్మ నిలిచిపోవడంతో ఆనందపడ్డ చిత్ర పరిశ్రమ ప్రముఖులకు.. ఆనందం ఎంతో కాలం నిలవలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు