-
మానవత్వానికి ప్రతి రూపాలు నర్సులు
-
ఆదిత్య ఆసుపత్రిలో ఘనంగా ప్రపంచ నర్సుల దినోత్సవం.
-
నర్సుల సేవలను కొనియాడిన డాక్టర్ శ్రీలత చంద్ర
హైదరాబాద్(క్రైమ్ మిర్రర్): బిన్ రెడ్డి తెలంగాణ చౌరస్తాలోని ఆదిత్య హాస్పిటల్‌లో, ప్రపంచ నర్సుల దినోత్సవ వేడుకలు డాక్టర్ శ్రీలత చంద్ర నేతృత్వంలో అత్యంత వైభవంగా, స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ..
వైద్య రంగంలో నర్సుల పాత్ర వెలకట్టలేనిదని, రోగి కోలుకోవడంలో డాక్టర్ ఇచ్చే మందుల కంటే నర్సులు చూపే ఆత్మీయత, అందించే సేవలే కీలకమని ప్రశంసించారు. నిరంతరం రోగుల సంరక్షణలో నిమగ్నమై, తమ కుటుంబాలను సైతం పక్కన పెట్టి, రాత్రింబవళ్లు శ్రమిస్తున్న నర్సులందరికీ ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం హాస్పిటల్‌లో పనిచేస్తున్న నర్సులందరినీ శాలువాలతో ఘనంగా సన్మానించి, పూలగుచ్ఛాలు అందజేసి డాక్టర్ శ్రీలత వారి సేవలను గుర్తు చేశారు. ఆసుపత్రి ప్రాంగణం అంతా నర్సుల నినాదాలతో, కేక్ కటింగ్ వేడుకలతో కోలాహలంగా మారగా, సేవలో తరించే నర్సులే సమాజానికి నిజమైన ఆరోగ్య ప్రదాతలని, వారి త్యాగనిరతికి ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేయాలని శ్రీలత చంద్ర పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం నర్సులలో కొత్త ఉత్తేజాన్ని నింపడమే కాకుండా, వారి వృత్తి పట్ల గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసింది.