Homeక్రైమ్హైదరాబాద్: 700 వందలు బకాయి ఇవ్వలేదని దారుణ హత్య...!

హైదరాబాద్: 700 వందలు బకాయి ఇవ్వలేదని దారుణ హత్య…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో గంజాయి కొనుగోలుకు సంబంధించిన రూ. 700 బకాయి గొడవలో మొహమ్మద్ హుస్సేన్ అలియాస్ వసీం అనే యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి అత్తాపూర్ పోలీసులు ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు.

గంజాయి ఇప్పిస్తానని మొహమ్మద్ హుస్సేన్ అలియాస్ వసీం ప్రధాన నిందితుడు ప్రశాంత్ దగ్గర రూ. 700 తీసుకున్నాడు. అయితే వసీం గంజాయి ఇవ్వకపోగా, తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. క్రమంలో శనివారం రాత్రి అత్తాపూర్ రోడ్డుపై వసీం కనిపించడంతో ప్రశాంత్ అతనితో గొడవకు దిగాడు.

ఆ సమయంలో ప్రశాంత్ స్నేహితులు కూడా అక్కడికి చేరుకుని, మెటల్ నకిల్స్ (ఇనుప పంచ్‌లు) తో వసీం తలపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ తీవ్ర దాడి కారణంగా వసీం అక్కడికక్కడే మరణించాడు. అనంతరం అక్కడినుండి పారిపోయారు. ఘటనలో పాలుపంచుకున్న 10 మందిలో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అరెస్ట్ అయిన నిందితులు: కె. ప్రశాంత్, మిట్టా జగదీష్, రామ్ రోషన్ యాదవ్, జి. తరుణ్ కుమార్, ఎ. నిఖిల్, జి. రాజ్ కుమార్, కె. వెంగళ్ రావు, ఎం. ప్రశాంత్.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు