Homeతెలంగాణఏకగ్రీవంగా రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

ఏకగ్రీవంగా రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

  • ఏకగ్రీవంగా రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

  • అధ్యక్షుడిగా మిట్టపల్లి సంతోష్

రామకృష్ణాపూర్, మే 12 (క్రైమ్ మిర్రర్): రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం స్థానిక సింగరేణి ఠాగూర్ స్టేడియం ఆవరణలో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత కమిటీని రద్దు చేస్తూ కొత్త కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా మిట్టపల్లి సంతోష్ వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నూతన కమిటీలో ప్రధాన కార్యదర్శిగా వేల్పుల కిరణ్ (ప్రజా ప్రతిభ), కోశాధికారిగా కూరపాటి శ్రీనివాస్ (టుడే టీవీ), ఉపాధ్యక్షుడిగా బద్రి సంతోష్ కుమార్ (క్రైమ్ మిర్రర్), సహాయ కార్యదర్శిగా గంజి సతీష్ (అక్షిత) ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా ఎరుకల బుచ్చిబాబు (సిటీ కేబుల్), ఎర్రవెల్లి శ్రీనివాస్ (అక్షర విజేత), పిల్లి రవికిరణ్ (ప్రజావాణి), దొలకల సంతోష్ (హైదరాబాద్ ఎస్టేట్), మారేపల్లి సాయి (ఆర్టీఐ ఎక్స్‌ప్రెస్)లను ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు మిట్టపల్లి సంతోష్ మాట్లాడుతూ నిజాయితీతో కూడిన జర్నలిజమే తమ లక్ష్యమన్నారు. పట్టణంలో ఎక్కడ అవినీతి, భూకబ్జాలు జరిగినా వాటిని వార్తల రూపంలో వెలుగులోకి తీసుకొస్తామని తెలిపారు. బాధితుల తరఫున నిలబడి అధికారులను ప్రశ్నించడంలో ప్రెస్ క్లబ్ ముందుంటుందని పేర్కొన్నారు.

రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ ఏ ఇతర క్లబ్‌లతోనూ విలీనం కాలేదని,స్వతంత్రంగానే కొనసాగుతోందని స్పష్టం చేశారు. ప్రెస్ క్లబ్ పేరు చెప్పి కొందరు విహారయాత్రల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తులతో తమ క్లబ్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రెస్ క్లబ్ పేరును దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటువంటి వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దని పట్టణ ప్రజలు, రాజకీయ నాయకులు, అధికారులను కోరారు.గతంలో సహకరించిన రాజకీయ నాయకులు, వర్తక సంఘాలు, పట్టణ ప్రజలు నూతన కమిటీకి కూడా ఇదే విధంగా సహకరించాలని కోరారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు