HomeతెలంగాణMother’s Day 2026: ఒకే డ్రెస్‌లో అమ్మా కూతుళ్లు.. అదిరిపోయే ట్విన్నింగ్ ఫ్యాషన్ ఐడియాలు ఇవే...!

Mother’s Day 2026: ఒకే డ్రెస్‌లో అమ్మా కూతుళ్లు.. అదిరిపోయే ట్విన్నింగ్ ఫ్యాషన్ ఐడియాలు ఇవే…!

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: అమ్మ అంటే ప్రేమ, ఆప్యాయత మాత్రమే కాదు.. స్టైల్‌కు కూడా మరో పేరు. చిన్నప్పటి నుంచి మనల్ని అందంగా తయారు చేసిన అమ్మతో ఇప్పుడు ఒకేలా రెడీ అవ్వడం కొత్త ట్రెండ్‌గా మారింది. ప్రస్తుతం “మదర్ అండ్ మీ ట్విన్నింగ్ ఫ్యాషన్” సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా Mother’s Day సందర్భంగా అమ్మా కూతుళ్లు ఒకే స్టైల్‌లో మెరవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఒకే రంగు, ఒకే డిజైన్‌తో ఉన్న డ్రెస్సులు ధరించి అమ్మా కూతుళ్లు కలిసి కనిపిస్తే అది చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఇది కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు.. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను, అనుబంధాన్ని చూపించే ప్రత్యేకమైన స్టైల్‌గా మారింది. కంప్లీట్ ట్విన్నింగ్ స్టైల్
ఈ స్టైల్‌లో అమ్మా కూతుళ్లు ఒకే రంగు, ఒకే డిజైన్‌తో ఉన్న దుస్తులు ధరిస్తారు. ఒకే తరహా చీరలు, లెహంగాలు లేదా ఫ్రాక్స్ వేసుకుంటే ఫ్యామిలీ ఫంక్షన్స్, ఫోటోషూట్స్‌లో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు.

కో-ఆర్డినేటెడ్ ఫ్యాషన్ రంగులు వేరైనా ఒకే ఫ్యాబ్రిక్ లేదా ఒకే డిజైన్ ఉండేలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు అమ్మ చీరకు మ్యాచింగ్‌గా కూతురికి ఫ్రాక్ కుట్టించుకోవచ్చు. ఇది సింపుల్‌గా ఉన్నా చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. కాంట్రాస్ట్ ట్విన్నింగ్ అమ్మ బ్లౌజ్ కలర్‌ను కూతురు డ్రెస్‌లో వాడటం లేదా కూతురు ఓణీ రంగును అమ్మ చీరలో మ్యాచ్ చేయడం కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఇలా చేస్తే ఫోటోలలో చాలా క్లాసీ లుక్ వస్తుంది.

అకేషన్‌కు తగ్గట్టుగా సెలక్షన్…

పండుగలు, పెళ్లిళ్లకు పట్టు చీరలు, అనార్కలీలు, లెహంగాలు బాగుంటాయి. ట్రిప్స్ లేదా బీచ్ వెకేషన్స్‌కు ఫ్లోరల్ ప్రింట్ మ్యాక్సీలు, మ్యాచింగ్ టీషర్ట్స్ ట్రై చేయొచ్చు. ఇవి ఫోటోలకు కూడా అదిరిపోయే లుక్ ఇస్తాయి.

యాక్ససరీస్ …

ఒకే రకమైన హెయిర్ బ్యాండ్స్, ఫుట్‌వేర్, జ్యువెలరీ లేదా చిన్న పెండెంట్స్ వేసుకుంటే ట్విన్నింగ్ లుక్ మరింత హైలెట్ అవుతుంది.ఫ్యాషన్ అనేది కేవలం దుస్తులు మాత్రమే కాదు.. ఒక అందమైన భావన. ఈ Mother’s Day సందర్భంగా అమ్మతో కలిసి ఒకే స్టైల్‌లో రెడీ అయి ప్రత్యేకమైన జ్ఞాపకాలు సృష్టించుకోండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు