Homeక్రీడలుమళ్లీ ముంబై కెప్టెన్ గా రోహిత్ శర్మ అయ్యే ఛాన్స్!

మళ్లీ ముంబై కెప్టెన్ గా రోహిత్ శర్మ అయ్యే ఛాన్స్!

క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ :- ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ గత కొద్ది సీజన్ల నుండి ఘోరమైన ప్రదర్శన కనబరుస్తుంది. ఒకప్పుడు ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచేది. మొత్తంగా ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఐదు ట్రోఫీలు నెగ్గీ ఐపీఎల్ చరిత్రలోనే ఒక రికార్డును సృష్టించింది. కానీ గత ఐదు సంవత్సరాల నుంచి ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్ చేరుకోవడానికి కూడా చాలా కష్టంగా మారింది. అయితే చాలా రోజుల తర్వాత రోహిత్ శర్మ తిరిగి మళ్లీ ఆ జట్టుకు కెప్టెన్సీ వ్యవహరించే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెన్నునొప్పి కారణంగా మ్యాచులకు దూరమయ్యాడు. మరోవైపు పాండ్యా స్థానంలో కెప్టెన్సీ తీసుకున్నటువంటి సూర్య కుమార్ యాదవ్ కూడా తండ్రి అయిన సందర్భంగా తర్వాత జరగబోయేటువంటి మ్యాచ్కు దూరం అవ్వనున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మకు మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. దీంతో రోహిత్ శర్మ మళ్ళీ కెప్టెన్సీ అయితే జట్టు మరోలా కనిపిస్తుంది అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా రోహిత్ శర్మ సారధ్యంలో ముంబై ఇండియన్స్ ఏకంగా ఐదు టైటిల్స్ గెలిచిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.

ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకున్న గవర్నర్.. స్పందించిన మంత్రి సత్య కుమార్ యాదవ్!

WHO Alert!: ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వైరస్!.. కరోనా కంటే డేంజరట

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు