HomeజాతీయంTrisha: రాజకీయాల్లోకి త్రిష.. తిరుచ్చి ఈస్ట్ బైపోల్ టికెట్ ఆమెకే!

Trisha: రాజకీయాల్లోకి త్రిష.. తిరుచ్చి ఈస్ట్ బైపోల్ టికెట్ ఆమెకే!

టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రిషా కృష్ణన్ ఇప్పుడు రాజకీయాల్లోకి రావచ్చనే వార్తలు తమిళనాడులో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేశారు. తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ అనే రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి రెండింటిలోనూ గెలిచారు. అయితే, ఒకేసారి రెండు స్థానాలను కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో, ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంది. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం విజయ్ పెరంబూర్ స్థానాన్ని కొనసాగించి, తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని ఖాళీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నిక బరిలో త్రిష

ఈ నేపథ్యంలో తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికలో టీవీకే పార్టీ తరఫున ఎవరిని బరిలోకి దింపుతారనే దానిపై ఆసక్తి పెరిగింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం త్రిష పేరే ఎక్కువగా వినిపిస్తోంది. విజయ్ ఖాళీ చేసే స్థానంలో త్రిషనే పోటీ చేయిస్తారనే ప్రచారం వేగంగా సాగుతోంది. పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, నెటిజన్లు మాత్రం ఈ వార్తలను వైరల్ చేస్తున్నారు. త్రిష గతంలో ఒక ఇంటర్వ్యూలో  అవకాశం వస్తే సీఎం అవ్వాలనుందని సరదాగా చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు మళ్లీ చర్చలోకి వచ్చాయి. మరోవైపు విజయ్, త్రిష మధ్య మంచి స్నేహం ఉందనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఈ కారణాలతోనే త్రిష రాజకీయాల్లోకి రావచ్చనే ఊహాగానాలు మరింత పెరిగాయి.

టీవీకే ప్రభుత్వంలో కీలక పదవి?

ప్రస్తుతం త్రిష నేరుగా ముఖ్యమంత్రి స్థాయికి వెళ్లే పరిస్థితి లేకపోయినా, ఉప ఎన్నిక ద్వారా ఎమ్మెల్యేగా అవకాశం రావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా టీవీకే ప్రభుత్వం ఏర్పడితే ఆమెకు కీలక బాధ్యతలు ఇవ్వవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే, ఇప్పటివరకు త్రిష కానీ, విజయ్ కానీ ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. నిజంగానే త్రిష రాజకీయ రంగప్రవేశం చేయబోతుందా? అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రాబోయే రోజుల్లో టీవీకే తీసుకునే నిర్ణయం ఈ చర్చలకు పూర్తి క్లారిటీ ఇవ్వనుంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు