Homeతెలంగాణరైతులకు అండగా బిఆర్ఎస్ పార్టీ ...పాల్వాయి స్రవంతి రెడ్డి...!

రైతులకు అండగా బిఆర్ఎస్ పార్టీ …పాల్వాయి స్రవంతి రెడ్డి…!

మునుగోడు, క్రైమ్ మిర్రర్: రైతులను ఇబ్బందులు పెట్టకుండా వేగవంతంగా ధాన్యం కొనుగోలు చేయాలని బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం మండలంలోని పలివెలలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బి ఆర్ ఎస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడారు.కొనుగోలు వేగవంతం చేయాలని,వడ్లు తెచ్చి రోజులు గడుస్తున్నా కాంటా పెట్టకపోవడం దారుణం అని మండిపడ్డారు. తరుగు పేరుతో దోపిడీ ఆపాలినీ ,నిబంధనల ప్రకారం 40.7 కేజీలు ఉండాల్సిన బస్తాకు, ఏకంగా 42 కేజీలు తూకం వేస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారు. వర్షం ముప్పు ఆకాశం మేఘావృతమై వర్షం ముప్పు పొంచి ఉన్నందున, రైతుల ధాన్యం తడవకముందే తక్షణమే కొనుగోలు పూర్తి చేయాలి..రైతు పక్షపాతిగా బి ఆర్ ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే రైతుల తరపున పోరాటం ఉధృతం చేస్తాం అన్నారు.

విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న స్రవంతి …

మునుగోడు మండల పరిధిలోని కిష్టాపురం గ్రామంలో నిర్వహిస్తున్న బొడ్రాయి ,ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్వాయి స్రవంతి రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు..కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు.. మారగోని అంజయ్య గౌడ్, మేకల శ్రీనివాస్ రెడ్డి,గజ్జల బాలరాజు గౌడ్,కమిటీ సభ్యులు గ్రామస్థులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు