HomeతెలంగాణKTR :మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయాలి...కేటీఆర్‌...!

KTR :మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయాలి…కేటీఆర్‌…!

  • ప్రభుత్వం చివరి గింజ కొనే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదు

 

సంగారెడ్డి, క్రైమ్ మిర్ర‌ర్‌: సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేటలో శనగల కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయలేక ప్రభుత్వం నాటకాలు ఆడుతోంది. రేవంత్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందనిమండిప‌డ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ రైతుబంధును సమయానికి వేయలేదు. రైతులకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ మోసం చేసింద‌న్నారు. రైతులకు సమయానికి రైతుబంధు వేసిన చరిత్ర కేసీఆర్ ది అని తెలిపారు.

ప్రభుత్వం పంటలను కొనకుండా అన్నదాతలను వేధిస్తోంద‌న్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా పంటలను కొన్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే. ఎలాంటి షరతులు లేకుండా ఈ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలి. రాబోయే వారం రోజుల పాటు కొనుగోలు కేంద్రాలను పరిశీలిద్దాం.. పార్టీ శ్రేణులంతా కొనుగోలు కేంద్రాల దగ్గర నిరసన చేయాలని అన్నారు.ఈ సంద‌ర్భంగా తహసీల్దార్, ఆర్డీవోలకు వినతిపత్రాలు ఇవ్వాల‌నిసూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలి. మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయాలి. వరి, జొన్నలు, శనగలకు మద్దతు ధర ఇవ్వడం లేదు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ కదం తొక్కుతుంద‌ని తెలిపారు బీఆర్ ఎస్ పార్టీ శ్రేణులు రైతులకు మద్దతుగా ఉండాల‌న్నారు. ధాన్యం కొనేవరకు అండగా ఉండాలి. ఒకవేళ ప్రభుత్వం కొనకపోతే.. తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనచేయాల‌ని ప్రభుత్వం చివరి గింజ కొనే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగ‌ద‌ని హెచ్చ‌రించారు.

తాజావార్తలు