Homeఆంధ్ర ప్రదేశ్Different climates in Telugu states: తెలుగు రాష్ర్టాల్లో భిన్న వాతావ‌ర‌ణం...ఒక ప‌క్క భానుడిప్ర‌తాపం..మ‌రో ప‌క్క...

Different climates in Telugu states: తెలుగు రాష్ర్టాల్లో భిన్న వాతావ‌ర‌ణం…ఒక ప‌క్క భానుడిప్ర‌తాపం..మ‌రో ప‌క్క వ‌ర్షాలు…!

హైద‌రాబాద్‌,క్రైమ్ మిర్ర‌ర్‌: తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. భానుడి ప్ర‌తాపంరోజురోజుకు పెరిగిపోతుంటే మ‌రో ప‌క్క ఉరుముల‌తోకూడిన‌వ‌ర్షాలు కురుస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కాకినాడ, పిఠాపురం, జగ్గంపేట, గొల్లప్రోలు, ప్రత్తిపాడులో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది.

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండుతుంటే. మంచిర్యాల‌,చెన్నూర్‌, మంద‌మ‌ర్రి, జ‌గిత్యాలాయాజిల్లాలోఉరుములతో వ‌ర్షాలు కురిసాయి. ఆయా ప్రాంతాల్లోని పిడుగులు సైతం పడ్డాయి. తీవ్ర ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఉపశమనం పొందారు.

రైతుల‌కు తీర‌నిన‌ష్టం…

ఒక ప‌క్క ఎండ‌లు మ‌రో ప‌క్క ఈదురు గాలుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డ్డాయి.దీంతో రైత‌న్న‌ల‌కు తీర‌ని న‌స్టంవాటిల్లింది.వ‌రి క‌ల్లాల్లోని ధాన్యం త‌డిసిపోగా కోత‌కొచ్చిన వ‌రి నేల వాలింది.మామిడి కాయ‌లు రాలిపోయాయి. దీంతో ఆరుగాలం క‌ష్ట‌ప‌డి ప‌ని చేసిన రైతన్న‌ల‌కు తీర‌నిన‌ష్టం వాటిల్లింది.

తాజావార్తలు