*నల్లగొండ జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం
*పలు ప్రాంతాల్లో మెరుపులతో కూడిన వర్షం
* చిన్నమాధారంలోని పురుగు మందుల దుకాణంలో షార్ట్ సర్క్యూట్
*కాలి బూడిదైన పురుగు మందులు, భారీగా నష్టం
క్రైమ్ మిర్రర్, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆదివారం(మే 3) సాయంత్రం సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పలు చోట్ల గాలి దుమారానికి పరిస్థితి గందరగోళంగా మారింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని పలు ఏరియాల్లో రాళ్ల వర్షం కురిసింది.
షార్ట్ సర్క్యూట్ కాలిపోయిన ఎరువుల దుకాణం
ఇక కనగల్ మండల పరిధిలోని చిన్న మాదారం గ్రామంలో భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో పెద్ద మొత్తంలో ఈదురు గాలులు వీచడంతో కరెంట్ సప్లైలో సమస్యలు తలెత్తాయి. ఫలితంగా స్థానికంగా ఉన్న రుత్విక్ సీడ్స్, ఫెస్టిసైడ్స్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. కరెంటులో హెచ్చుతగ్గుల కారణంగా మెయిన్ లైన్ లో మంటలు చెలరేగాయి.
కాసేపట్లోనే దుకాణం అంతా దట్టమైన పొగతో పాటు మంటలు వ్యాపించాయి. వెంటనే స్పందించిన స్థానికులు నీళ్లు తెచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. అప్పటికే ఫెస్టిసైడ్స్, గులికలు, న్యూట్రీన్స్ లిక్విడ్, పౌడర్లు కాలిపోయాయి. సుమారు రూ. 2 లక్షలకు పైగా మందులు కాలిపోయినట్లు దుకాణం యజమాని గాజుల సైదులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రమాదానికి ముందే లంచ్ కు వెళ్లిన యజమాని
ప్రమాద సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణహాని కలగలేదు. ఈ యాక్సిడెంట్ కు కొద్దిసేపటి ముందే షాపు యజమానికి సైదులు లంచ్ కు వెళ్లడంతో పెద్ద ముప్పు తప్పినట్లు అయ్యింది. జరిగిన నష్టాన్ని ఆయా పురుగు మందుల కంపెనీలకు చెప్పినట్లు యజమానికి చెప్పారు. తమనకు ఆదుకోవాలని సైదులు విజ్ఞప్తి చేశారు.