Homeతెలంగాణవివాహేత‌ర మోజులో చిన్నారి దారుణ హ‌త్య‌...!

వివాహేత‌ర మోజులో చిన్నారి దారుణ హ‌త్య‌…!

విజ‌య‌వాడ‌, క్రైమ్ మిర్ర‌ర్‌: విజ‌య‌వాడ‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. గ‌న్న‌వ‌రం చెంచుల కాల‌నీకి చెందిన ఒక మ‌హిళ‌కు, వంశీ అని వ్య‌క్తికి ఏర్ప‌డిన ప‌రిచ‌యం వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. ఇద్ద‌రు విజ‌య‌వాడ‌లో స‌హ‌జీవ‌నం చేస్తున్నారు.ఈ క్ర‌మంలో వారి మ‌ధ్య గొడ‌వ జ‌రుగ‌డంతో కోపోద్రిక్తుడైన వంశీ చిన్నారును చిత‌క బాదిచంపేసిన ఘ‌ట‌న ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం రేపింది.

విజయవాడలో సహజీవనం…

పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. విజయవాడలోని సత్యనారాయణపురంలో వంశీతో కలిసి ఓ మహిళ సహజీవనం చేస్తోంది. తన భర్తను, కుటుంబాన్ని వదిలేసి, గత రెండు నెలలుగా తన ఇద్దరు పిల్లలతో (ఐదేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె) కూడా అక్కడే ఉంటున్నారు. ఇటీవల వంశీకి, ఆ మహిళకు మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఆ వాగ్వాదంలో ఆగ్రహానికి లోనైన వంశీ.. రెండేళ్ల చిన్నారిని విచక్షణారహితంగా కొట్టాడు. ఆ దెబ్బలకు తాళలేక పాప ప్రాణాలు విడిచింది. చిన్నారి చనిపోయిన తర్వాత, విషయం బయటకు రాకుండా ఉండేందుకు అనారోగ్యంతో చనిపోయిందని ఆమె తన భర్తకు సమాచారం ఇచ్చింది.

కేసు చేదించిన పోలీసులు…

హ‌త్య చేసిన త‌రువాత న‌మ్మించేందుకు కుటిల ప్ర‌య‌త్నాలు చేశారు. కాని వారి పాపం పండింది. ఈ మొత్తం దారుణాన్ని ఈ మొత్తం దారుణాన్ని ఆమె ఐదేళ్ల కుమారుడు కళ్లారా చూశాడు. తండ్రి అడిగినప్పుడు, వంశీనే తన చెల్లిని కొట్టి చంపినట్లు ఆ బాలుడు వివరించాడు. కొడుకు చెప్పిన మాటలు, పాప మృతిపై ఉన్న అనుమానాలతో తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా.. పోస్టుమార్టం నివేదిక, బాలుడి వాంగ్మూలం ఆధారంగా వంశీనే హత్య చేసినట్లు నిర్ధారించారు. నిందితుడు వంశీని అదుపులోకి తీసుకున్నారు. మహిళ పాత్రపై కూడా పోలీసుల విచారణ కొనసాగుతోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు