Homeఆంధ్ర ప్రదేశ్Brutal murder of husband and wife :భార్య భ‌ర్త‌ల దారుణ హ‌త్యా...! గ్రామంలో విషాదం...

Brutal murder of husband and wife :భార్య భ‌ర్త‌ల దారుణ హ‌త్యా…! గ్రామంలో విషాదం…

శ్రీ‌కాకుళం, క్రైమ్ మిర్ర‌ర్‌: శ్రీ‌కాకుళంలో జంట హ‌త్య‌లు ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం రేపాయి. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది.కొత్తూరు మండలం చిన్న రాజపురం గ్రామంలో చేతబడి నెపంతో భార్యాభర్తలను దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.కాగా ఈ ప్రాంతంలో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గురయ్యారు. మృతులను సవర ఎల్లంగి, సవర గయాని గా పోలీసులు గుర్తించారు. గ్రామంలో కొంతకాలంగా చేతబడి ఆరోపణల నేపథ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నట్లు సమాచారం. ఇదే వివాదం హత్యలకు దారితీసినట్లు అనుమానిస్తున్నారు.

ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అలాగే సంఘటనా ప్రదేశంలో ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఘటన అనంతరం నిందితులు పరారీలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు