క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- రెండు తెలుగు రాష్ట్రాలలో 10వ తరగతి ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని పదవ తరగతి ఫలితాలు మధ్యాహ్నం రెండు గంటలకు విడుదల కానున్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు అందరూ కూడా ఈరోజు తమ ఫలితాలను తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగినటువంటి ఈ పదవ తరగతి పరీక్షలకు దాదాపు తెలంగాణ రాష్ట్రం నుంచి ఐదు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. దీంతో ఈరోజు ఫలితాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఒకవైపు స్టూడెంట్స్ తో పాటు మరోవైపు తల్లిదండ్రులు కూడా ఆసక్తిగా ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు మధ్యాహ్నం పదో తరగతి ఫలితాలు విడుదల చేస్తాము అని మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ దాదాపు 6 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. దీంతో ఇవాళ మరియు రేపు ఫలితాలపై విద్యార్థులందరిలోనూ ఉత్కంఠ అయితే నెలకొంది. ఫలితాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో చాలామంది మదిలో ఆత్మహత్య అనే పేరు వినిపిస్తుంది. మార్క్స్ అనేవి కేవలం చదువుకు మాత్రమే అని.. జీవితానికి కాదు అని అధికారులు సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మార్కులపై ఒత్తిడి చేయకూడదు అని హెచ్చరించారు.
అర్హులైన లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇండ్లు…జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్…!
CBI Joint Director: సీబీఐ జేడీకి 3 నెలల జైలుశిక్ష, న్యాయస్థానం సంచలన తీర్పు!