Homeట్రావెల్Breaking: ఆర్టీసీ సమ్మె ముగింపు...!

Breaking: ఆర్టీసీ సమ్మె ముగింపు…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: ఇది ప్రయాణికులకు పెద్ద ఊరటనిచ్చే వార్త. ప్రభుత్వం మరియు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) జేఏసీ మధ్య జరిగిన చర్చలు సఫలమవడంతో కార్మికులు తమ సమ్మెను విరమించారు. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు యథావిధిగా అందుబాటులోకి వచ్చాయి.

కార్మికులు కోరిన ప్రధాన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం వల్ల కార్మిక సంఘాలు సమ్మెను విరమించుకున్నాయి. గత కొన్ని రోజులుగా రవాణా పరంగా ఇబ్బందులు పడ్డ సామాన్య ప్రజలకు, విద్యార్థులకు ఇప్పుడు మార్గం సుగమమైంది..

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు