-
కార్నెగీ ఎండోమెంట్స్ సర్వేలో వెల్లడి…
ఢిల్లీ, క్రైమ్ మిర్రర్: అమెరికాలో ఉద్యోగం చేయడం, అక్కడ ఉండడం ప్రతి ఒక్కరి కల అని చెప్పవచ్చు. కాని ప్రస్తుతం ఆ కల చెదిరి ఇక అగ్ర రాజ్యంగో ఉండలేమని పలువురు భారతీ అమెరికన్లు భావిస్తున్నారు. అక్కడి పరిస్థితులతో రోజురోజుకూ వారిలో ఆందోళన పెరుగుతోంది. యూఎ్‌సను వదిలి వెళ్లిపోవడానికి తాము సిద్ధం అంటూ సుమారు 40ు మంది భారత జాతీయులు చెబుతున్నారు. రాజకీయ, ఆర్థి క, సామాజిక పరిస్థితులే దీనికి కారణంగా పేర్కొంటున్నారు. యూగవ్‌తో కలసి కార్నెగీ ఎండోమెంట్స్ సంస్థ చేసిన సర్వేలో వెయ్యి మంది అభిప్రాయాలు సేకరించగా, ఆ విషయం వెల్లడైంది.
అమెరికాను వదిలి వెళ్లిపోవాలనే ఆలోచన తమకు తరచూ వస్తోందని 14ు మంది, అప్పుడప్పుడూ అలా అనిపిస్తోందని 26ు మంది సర్వేలో పేర్కొన్నారు. అమెరికా రాజకీయాలు, ప్రభుత్వ విధానాలపై 58ు మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెరిగిన జీవన వ్యయాన్ని భరించలేకపోతున్నామని 54ు మంది చెప్పారు. వ్యక్తిగత భద్రత అంశాన్ని 41ు మంది ప్రస్తావించారు.
ప్రస్తుతం 52 లక్షల మంది భారత జాతీయులు అమెరికాలో నివసిస్తున్నారు. ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత ఆర్థిక వ్యవస్థ నిర్వహణ, వలస విధానాలు, అంతర్జాతీయ సంబంధాల్లో ప్రభుత్వ నిర్ణయాలు తమకు నచ్చడం లేదని ఏకంగా 71ు మంది చెప్పారు. ఇక భారతీయులు అమెరికాను వదిలి వెళ్లిపోవాలి అనుకోవడానికి పెరిగిపోతున్న ఖర్చులు కూడా మరో ప్రధాన కారణం.