-
రూ.100 కోట్ల పరువు నష్టం దావా
-
నోటీసులు పంపిన బిజెపి నేత భాను ప్రకాశ్ రెడ్డి
-
తీవ్ర స్థాయిలో మండిపడిన మెగా బ్రదర్ నాగబాబు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: సినీ నటుడు ప్రకాష్ రాజ్ వ్యవహార శైలి పై హిందూ సమాజం నుంచి తీవ్ర అభ్యంతరాలు, ఆగ్రహం వ్యక్తం అవుతోంది. శ్రీరాముడిపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నారు చాలామంది. ప్రకాష్ రాజ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ప్రకాష్ రాజ్ క్షమాపణ చెప్పకుంటే 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తాను అంటూ బిజెపి నేత భాను ప్రకాష్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. మరోవైపు మెగా బ్రదర్ నాగబాబు సైతం ప్రకాష్ రాజ్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రామలక్ష్మణులపై అనుచిత వ్యాఖ్యలు…
ప్రకాష్ రాజ్ ఇటీవల రామలక్ష్మణులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామలక్ష్మణులను ఉత్తరాది వలస కూలీలుగా అభివర్ణించారు. దీనిపై హిందూ సమాజం తీవ్రస్థాయిలో మండిపడుతోంది. సోషల్ మీడియా వేదికగా ఎక్కువ మంది రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ కు బిజెపి నేత, టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆ నోటీసులో డిమాండ్ చేశారు. కోట్లాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు ఉన్నాయని భాను ప్రకాష్ మండిపడ్డారు. ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పకుంటే 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తాను అంటూ భాను ప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు.
ఘాటుగానే స్పందించిన నాగబాబు …
మెగా బ్రదర్ నాగబాబు సైతం ప్రకాష్ రాజ్ తీరుపై మండిపడ్డారు. ప్రకాష్ రాజు కామెంట్స్ ను తీవ్రంగా తప్పుపట్టారు. భవిష్యత్తులో మీలాంటి గౌరవం మరిచి ప్రవర్తించిన వారితో వాదనకు దిగనంటూ హాట్ కామెంట్స్ చేశారు. ప్రకాష్ రాజ్ క్రైస్తవ నాస్తికుడు అని చెప్పుకుంటున్నప్పటికీ.. ఆమె తల్లి అంత్యక్రియలప్పుడు ఆమె విశ్వాసాన్ని గౌరవించారు. ఒక కొడుకుగా అది మీ కర్తవ్యం అని మేము గుర్తిస్తాము. మీరు కూడా అదే స్ఫూర్తితో కోట్లాదిమంది నమ్మకాలను గౌరవించాలి. నాస్తికత్వం అంటే దేవుళ్లను కానీ.. విశ్వాసాలను కానీ ఎగతాళి చేయడం కాదు. అదో హేతుబద్ధమైన ఆలోచన విధానం.
హిందూ మతం మాత్రమే తన సిద్ధాంతాల ద్వారా నాస్తికత్వాన్ని కూడా స్వీకరించిన ఏకైక మతం. అలాంటి సంప్రదాయాన్ని తోసి పుచ్చడం హేతుబద్ధత కాదు. అది ఆ గౌరవం. మీకు ఒకటే చెబుతున్న. భవిష్యత్తులో మీలా గౌరవం మరిచి ప్రవర్తించే వ్యక్తులతో నేను ఎప్పటికీ వాదించను. విభిన్న విశ్వాసాలను, వ్యవస్థలను గౌరవించడమే హేతుబద్ధతకు, బాధ్యతకు నిజమైన ఆదర్శం అంటూ తేల్చి చెప్పారు నాగబాబు. అయితే నాగబాబు స్పందన పై ప్రకాష్ రాజ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి