Homeతెలంగాణమందుబాబులకు షాక్...!

మందుబాబులకు షాక్…!

  • డిమాండ్ కు తగ్గ ఉత్పత్తి లేదు

  • మంజీరాలో నీటి కొరత కారణం

  • వచ్చే నెలలో చాలా కష్టమే

 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మందుబాబులకు చేదువార్త. వేసవిలో చల్లటి బీర్లకు కొరత ఏర్పడనుంది. డిమాండ్ కు తగ్గట్టు బీర్ల ఉత్పత్తి అసాధ్యం అని తెలుస్తోంది. ఎండల తీవ్రతతో పాటు బీర్ల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. కొద్ది రోజులుగా బీర్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. ఒక్క మార్చిలోనే 22 శాతం మేరకు విక్రయాలు పెరిగాయి. గత ఏడాది మార్చిలో 39 లక్షల బీరు కేసులు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది మాత్రం రికార్డు స్థాయిలో 50.78 లక్షల కేసులు విక్రయించారు. గత ఐదేళ్లలో ఇదే అత్యధికం. ఈ లెక్కన చూస్తే మాత్రం వచ్చే నెలలో బీర్ల కొరత ఏర్పడే అవకాశం ఉంది. అదే జరిగితే మందు బాబులకు ఇది చేదువార్త కానుంది.

ఈ ఏడాది రికార్డు స్థాయిలో…

సాధారణంగా వేసవిలో బీర్ల అమ్మకాలు గణనీయంగా ఉంటాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. ఈ నెలలో ఎప్పటి వరకు 21 లక్షల కేసుల విక్రయాలు జరగడం గమనార్హం. ప్రస్తుతం రోజుకు సగటున 1.70 లక్షల నుంచి 1.80 లక్షల వరకు బీరు కేసులు అమ్ముడవుతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి నుంచి రికార్డు స్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ప్రతి నెల పెరుగుదల కనిపించింది అమ్మకాలు. మే నెలలో ఇంకా బీర్ల వాడకం పెరిగి.. నీటి కొరత ఏర్పడితే మాత్రం ఉత్పత్తి పడిపోయి బీర్లకు కొరత ఏర్పడే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ చెబుతోంది.

మంజీరా నీరే గతి…

హైదరాబాద్ చుట్టూ బీర్ల తయారు చేసే పరిశ్రమలు మంజీరా నీటిపైనే ఎక్కువగా ఆధారపడతాయి. ప్రస్తుతం ఆ నదిలో నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. దీంతో బీరు తయారీ యూనిట్లకు నీటి కష్టాలు మొదలయ్యాయి. ఒకవేళ నీరు పూర్తిగా అడుగంటితే మాత్రం వేసవిలో డిమాండ్కు తగ్గట్టు సరఫరా చేయలేని పరిస్థితి.

అయితే ఎట్టి పరిస్థితుల్లో వేసవిలో బీర్ల కొరత రానివ్వమని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. ఎక్కడ కొరత లేకుండా మద్యం డిపోల నుంచి దుకాణాలకు నిరంతరాయంగా బీర్ల కేసులు సరఫరా చేసేందుకు సిద్ధపడింది. సాధారణంగా వేసవికాలంలో గోదాముల్లో 15 రోజులకు సరిపడా స్టాక్ ఉంచుతారు. ప్రస్తుతం మాత్రం 35 రోజులకు సరిపోయే స్టాక్ ఉంచుతున్నట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు