మహేశ్వరం, క్రైమ్ మిర్రర్: మహేశ్వరం,నియోజకవర్గం రావిర్యాల ఫ్యాబ్ సిటీ భూ నిర్వాసితులకు న్యాయం జరిగేవరకు ఎలాంటి పనులు జరుగనివ్వమని రైతులు డీమాండ్ చేశారు. శుక్రవారం ఫ్యాబ్ సిటీలో ఓ ప్రైవేట్ పరిశ్రమ కోసం పనులు ప్రారంభించడానికి వచ్చిన అధికారులను అడ్డుకున్న భూ నిర్వాసితులు.
సంవత్సరాలుగా భూ పోరాటం చేసిన రైతులకు కేసులు ఉన్న సర్వే నంబర్ భూమిలో కొంతమందికి మాత్రమే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి కోర్టు నుండి ఆర్డర్ రాగానే రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు కేసులు ఉన్న భూములలో మాకు ప్లాట్లు ఎలా ఇస్తారని ప్రభుత్వంపై మండిపడుతూ… ఏలాంటి కేసులు లేని భూములలో ఫ్యాబ్ సిటీలో భూములు కోల్పోయిన రైతుకులకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.రైతులను నష్టపరిహారం అందేవరకు భూ పోరాటం ఆగదని, ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు
