బెంగుళూరు, క్రైమ్ మిర్రర్: ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు టైరు పేలి బస్సును ఢీకొట్టిన సంఘటనలో ఆరుగురు మృతి చెందిన ఘటన యాదగిరి జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. కారు బస్సును ఢికొట్టిన ఘటనలో బస్సుకు మంటలు అంటుకోగా వేగంగా కారుకు సైతం మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం ఉదయం ఓ ప్రైవేట్ బస్సు కలబురగి నుంచి బెంగళూరు వెళుతోంది. మరో వైపు ఓ కారు యాదగిరి నుంచి రాయచూరు వెళుతోంది. యాదగిరి దగ్గర కారు ప్రమాదానికి గురైంది.హైవేపై వేగంగా దూసుకు వెళుతున్న కారు టైర్ పేలింది. దీంతో అదుపుతప్పిన కారు.. వేగంగా వెళ్లి బస్సును ఢీకొట్టింది. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఆ మంటలు వేగంగా కారుకు వ్యాపించాయి. కారు, బస్సు మంటల్లో దగ్ధం అయ్యాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరు మంది కాలి బూడిదయ్యారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్పగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
