హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: హైదరాబాద్ పట్టణంలో పెళ్లిపేరుతో యువతిని మోసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లా చెరువుపల్లి ప్రాంతానికి చెందిన పనస మధు అనే వ్యక్తి తనకు తాను ప్రభుత్వ ఉద్యోగినని యువతిని నమ్మించి కోట్ల రూపాయలు కాజేసినట్లు పోలీసులు వెల్లడించారు. తాను ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ)లో పని చేస్తున్న ఉద్యోగిగా పని పరిచయం పెంచుకున్నారు. ఈ క్రమంలో చెర్లపల్లి-3 టెక్నికల్ మేనేజర్‌గా ఉన్నానని చెప్పి నమ్మకం కల్పించాడు. ఇందు కోసం సాంకేతిను ఉపయోగించి నకిలీ ఐడీ కార్డును తయారు చేసి చూపిస్తూ యువతిని పూర్తిగా మోసగించాడు.
పెళ్లి పేరుతో మొదట రూ.2 కోట్లు వరకట్నంగా డిమాండ్ చేసిన నిందితుడు, చివరకు రూ.1.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు నిశ్చితార్థం కూడా జరిగింది. అనంతరం “ఫ్రీ వెడ్డింగ్ ఫోటోషూట్” పేరుతో యువతిని ఒక గదికి పిలిపించి అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో బాధితురాలికి అనుమానం కలిగింది. దీంతో అతని గురించి విచారణ చేయగా చెప్పిన ఉద్యోగం పూర్తిగా నకిలీ అని బయటపడింది.
దీంతో బాధితురాలు చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి రెండు నకిలీ FCI ఐడీ కార్డులు, ఒక మొబైల్ ఫోన్, “On Govt Duty” స్టికర్ ఉన్న కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మ్యాట్రిమోనియల్ వ్యవహారాల్లో తెలియని వ్యక్తులపై పూర్తిగా నమ్మకం పెట్టుకునే ముందు వారి ఉద్యోగ వివరాలు, వ్యక్తిగత నేపథ్యం పూర్తిగా ధృవీకరించుకోవాలని పోలీసులు సూచించారు. కాగా ఇతని చేతిలో ఇంకేవరైన మోసపోయారా ఇంకెవరైన బాధితులు ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
