Homeతెలంగాణరేవంత్ స‌ర్కార్ గుడ్ న్యూస్‌....ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో హెల్త్ ఏటీఎంలు...! డాక్ట‌ర్ అవ‌స‌రం లేకుండానే...

రేవంత్ స‌ర్కార్ గుడ్ న్యూస్‌….ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో హెల్త్ ఏటీఎంలు…! డాక్ట‌ర్ అవ‌స‌రం లేకుండానే…

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్: తెలంగాణ ప్ర‌జ‌ల‌కు రేవంత్ స‌ర్కార్ గుడ్ చెప్ప‌నుంది. డాక్ట‌ర్ అవ‌స‌రం లేకుండానే ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో హెల్త ఏటీఎంలు ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. పైలెట్ ప్రాజెక్టు కింద హైద‌రాబాద్‌లో రెండు ఆసుప‌త్రుల్లో హెల్త్ ఏటీఎంలు ప్ర‌వేశ‌పెట్టింది. వీటి నుంచి ఫ‌లితాలు ఫ‌లితాలు బాగా ఉండ‌డంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడ వీటిని ఏర్పాటు చేసేందుకు సిద్ద‌మ‌వుతుంది. . హెల్త్ ఏటీఎంలుగా పిలుస్తున్న ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్టింగ్ మెషీన్లను త్వరలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులోకి రానున్నాయి.

ఒకే దగ్గ‌రా 132 పరీక్షలు…

ప్రయోగాత్మ‌కంగా కింగ్‌కోఠి ఆసుప‌త్రి, మ‌ల‌క్‌పేట్ ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేయ‌గా ఇవి విజ‌య‌వంతం అయ్యాయి. రోగ నిర్ధారణలో ఇవి ఖచ్చితత్వాన్ని చూపిస్తున్నాయి. ఈ హెల్త్ ఏటీఎంలలో పరీక్షలు చేయించుకున్న రోగుల నమూనాలను టీ డయాగ్నోస్టిక్‌ కేంద్రాలకు పంపారు. ఇక ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లలో కూడా పరీక్షలు నిర్వహించారు. హెల్త్ ఏటీఎంలలో వచ్చిన రిజల్ట్స్.. వీటిల్లోనే అలాగే వచ్చాయి. ఫలితాలు సరిపోవడంతో హెల్త్ ఏటీఎంల పనితీరు బాగుందనే అంచనా అధికారులు వచ్చారు. దీంతో మరిన్ని ప్రభుత్వ దవాఖానాల్లో వీటిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. రోగుల రద్దీ ఎక్కువగా ఉంటే హాస్పిటల్స్‌లో వీటిని ఏర్పాటు చేయడం వల్ల ఆరోగ్య సేవలు వేగంగా అందించవచ్చు.

డాక్ట‌ర్ లేకుండానే...

డాక్ట‌ర్ లేకుండా ప్రాథ‌మిక ఆరోగ్య ప‌రీక్ష‌లు అన్ని పూర్తి చేస్తాయి ఈ ఎటీఎంలు. కేవ‌లం కొన్ని నిమిషాల్లోనే 132 ర‌కాల టెస్టులు అటోమెటిక్‌గా వ‌స్తాయి. అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ వైద్య పరికాలతో పనిచేసే ఈ ఏటీఎంలు.. రోగి బాడీని స్కాన్ చేసి బీపీ, రక్తంలో ఆక్సిజన్ స్థాయి. బరువు, ఎత్తు, బాడీ టెంపరేచర్ వంటి వాటిని వేగంగా కొలుస్తాయి. ఇక డెంగ్యూ, మలేరియా. యూరిన్, కొలెస్ట్రాల్, ఈసీజీ, షుగర్, హెచ్‌ఔడీ వంటి ర్యాపిడ్ టెస్టులు వేగంగా చేస్తాయి.

ఇక రోగి డిజిటల్ హెల్త్ రికార్డ్ తయారుచేసి భద్రపరుస్తుంది. ఇక టెస్టులు పూర్తయిన తర్వాత దీని ద్వారానే డాక్టర్‌తో మాట్లాడుకోవచ్చు. వీటిని ప్ర‌యివేటు సంస్థ అభివృద్ది చేయ‌గా వీటిని రెండు ఆసుప‌త్రుల్లో ప్ర‌యోగాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టి విజ‌య‌వంత‌మ‌య్యాయి. వీటి తో ఆసుప‌త్రుల్లో రోగుల‌కు వేగంగా సేవ‌లు అందుతున్నాయి. దీనితో అనేక లాభాలు ఉన్నాయ‌ని అధికారులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు