Homeజాతీయంవారం రోజుల్లో బంగారం ధరలు ఎంత పెరిగాయో తెలుసా?

వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత పెరిగాయో తెలుసా?

బంగారం, వెండి మార్కెట్లో ఈ వారంలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని రోజులుగా ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. మొత్తం వారపు ట్రెండ్ పరిశీలిస్తే, బంగారం ధరల్లో కొంత పెరుగుదల కనిపించింది.

హైదరాబాద్‌లో మార్చి 29న 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,48,090 వద్ద ఉండగా, ఏప్రిల్ 4 నాటికి ఇది రూ.1,50,930కు చేరింది. అంటే వారం రోజులలో రూ.2,840 పెరిగినట్లు చెప్పవచ్చు. 22 క్యారెట్ల బంగారం ధర మార్చి 29న రూ.1,35,750 వద్ద ఉండగా, శనివారం వరకు రూ.1,38,350కు చేరింది. ఈ వారం మొత్తం రూ.2,600 పెరుగుదల నమోదైంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం మార్చి 29న రూ.1,49,020 వద్ద ట్రేడవుతూ, ఏప్రిల్ 4న రూ.1,52,180కు పెరిగింది. అంటే మొత్తం రూ.3,160 విలువ పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర మార్చి 29న రూ.1,36,600 నుంచి రూ.1,39,500కు చేరింది, అంటే రూ.2,900 పెరుగుదల.

ఢిల్లీ మార్కెట్‌లో మార్చి 29న 24 క్యారెట్ల బంగారం రూ.1,48,220 వద్ద ఉండగా, ఏప్రిల్ 4 నాటికి రూ.1,51,080కు చేరింది. మొత్తం రూ.2,960 పెరుగుదల. 22 క్యారెట్ల బంగారం మార్చి 29న రూ.1,35,900 నుంచి ఏప్రిల్ 4న రూ.1,38,500కు చేరింది.

అటు ఆదివారం గోల్డ్ రేట్లు స్ధిరంగా ఉన్నాయి. వారం రోజుల పెరుగుదలకు బ్రేక్ పడింది. నేడు 24 క్యారెట్ల బంగారం రూ.1,50,930 వద్ద ట్రేడవుతోంది. 22 క్యారెట్ల బంగారం రూ.1,38,350 వద్ద ఉంది. వెండి ధరల్లో కూడా పెద్ద మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.2,55,000 వద్ద ట్రేడవుతోంది.

ALSO READ: విద్యుత్ కేంద్రాలపై దాడి జరిగితే విధ్వంసమే: ఇరాన్

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

తాజావార్తలు