క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తాజాగా తెలుగుదేశం పార్టీ నాయకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎటువంటి రాజీ పడే పద్ధతి లేదు అని ఆ పార్టీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. ఇకపై తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తే ఎంతటి వారినైనా సరే సస్పెండ్ చేస్తాము అని తీవ్రంగా హెచ్చరించారు. కాబట్టి ఎమ్మెల్యేలు అందరూ కూడా సొంత ప్రయోజనాల కోసం కాకుండా పార్టీ పరువు ప్రతిష్ట కోసం అడుగులు వేయాలి అని సూచించారు. కాగా ఈమధ్య నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు తనకు కావాల్సినటువంటి వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వలేదు అని రచ్చ రచ్చ చేసిన విషయం నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి కానీ అలాగే పార్టీకి కానీ చెడ్డ పేరు తీసుకువచ్చే పనులు చేస్తే ఇకపై సహించబోము అని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే అలాగే నాయకులకు గుర్తుంచుకోవాలి అని సీఎం తెలిపారు.
ఉద్యోగమే కాదు కంపెనీలను స్థాపించే విధంగా ఎదగండి : సోను సూద్
ఫుడ్ సేఫ్టీ రైడ్స్ లో ఐస్ క్రీమ్ కల్తీలు.. పలు గ్రామాల్లో బండ్లు నిషేధం!
