తిరుపతి, క్రైమ్ మిర్రర్: తిరుపతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటి యజమాని వివాహితపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 2న గురువారం తెల్లవారు జామున అలిపిరి పోలీస్ స్టేషన్ పరిదిలోని శ్రీరాంనగర్ అక్కారంపల్లి రోడ్డు ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ విషయం తెలియడంతో ఆ ప్రాంతమంగా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాగా బాబుతో ఒంటరిగా ఉన్న మహిళపై ఇంటి యజామాని అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
మహిళపై దారుణంగా వికృత చేష్టలు చేయడంతో పాటు ఫోన్లో ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి భయపెట్టాడు. దీంతో ఆ మహిళా తీవ్ర భయాందోళనకు గురై భర్త విదేశాల్లో ఉండడతో పుట్టింటికి వెళ్లి బంధువుల సాయంతో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటి యజామాని శ్రీనివాస్ రెడ్డిపై రేప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
