HomeతెలంగాణNew Bride suicide: పెళ్లైన నెల‌కే...! న‌వ‌వ‌ధువు.. హైద‌రాబాద్‌లో ఘోరం...

New Bride suicide: పెళ్లైన నెల‌కే…! న‌వ‌వ‌ధువు.. హైద‌రాబాద్‌లో ఘోరం…

హైదరాబాద్, క్రైమ్ మిర్ర‌ర్: అద‌న‌పు క‌ట్నం తేవాల‌ని భ‌ర్త వేధింపులు త‌ట్టుకోలేక పెళ్ల‌యి నెల రోజులు గ‌డువ‌క‌ముందే ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ఆ ప్రాంతంలో విషాదం నిపింది. భీహార్‌కు చెందిన మృతురాలు ఇసికా యాద‌వ్ 2020లో సోష‌ల్ మీడియా ద్వారా ప‌రిచ‌య‌మైన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన నీరాజ్ బ‌న్స‌ల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఫిబ్రవరి 20,2026 న పెద్దల సమక్షం లో అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసుకున్నారు.

మియాపూర్ లోని మక్త మహబూబ్ పేట్ లోనీ ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇటీవల ఇద్దరి మధ్య అదనపు కట్నం నేపథ్యంలో గొడవలు జరిగినట్లు సమాచారం. భర్త వేధింపులు తట్టుకోలేక తీవ్ర మ‌న‌స్తాపం చెందిన ఇసిక తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా భర్త ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలికి చేరుకున్న మియాపూర్ పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు ద‌ర్యాప్తు చేసి విచార‌ణ చేస్తున్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు.

 

తాజావార్తలు