Homeక్రైమ్సినిమాల్లోకి కేటీఆర్ తనయుడు...!

సినిమాల్లోకి కేటీఆర్ తనయుడు…!

  • గట్టిగా ప్లాన్ చేస్తున్న తండ్రి

  • సరైన దర్శకుడు, కథ కోసం వెతుకులాట

  • సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం

 

క్రైమ్ మిర్రర్, సినీ డెస్క్: టాలీవుడ్ లోకి మరో రాజకీయ వారసుడు ప్రవేశించనున్నారా? తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. సాధారణంగా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబాల నటులు రావడం చాలా అరుదు. ఇటువంటి సమయంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మనవడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షురావ్ సినిమా రంగంలో తన టాలెంట్ నిరూపించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇమామ్స్ ఒక పవర్ఫుల్ ప్రాజెక్టుతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే టాక్ టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. కేటీఆర్ తన కుమారుడిని గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు సరైన కథ, దర్శకుడి కోసం వెతుకుతున్నట్టు టాక్ నడుస్తోంది.

రాజకీయాల్లోకి నో ఛాన్స్…

Also Read:భార్య మృతి.. అంత్యక్రియల్లోనే భర్తకు గుండెపోటు.. ఒకే రోజు దంపతుల మృతి

హిమాన్షు ఇప్పటివరకు రాజకీయ వేదికలు పంచుకున్న సందర్భాలు లేవు. కానీ కళాకారుడిగా తనను తాను ఇప్పటికే నిరూపించుకున్నాడు. సోషల్ మీడియాలో మ్యూజిక్ టాలెంట్ తో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన విడుదల చేసిన కవర్ సాంగ్స్ మ్యూజిక్ వీడియోలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నతనంలో బొద్దుగా ఉంటూ కనిపించిన హిమాన్షు క్రమంగా తన ఫిజిక్ ను పూర్తిగా మార్చేశారు. హీరోకు కావాల్సిన మేనరిజం, ఇతర యాక్టింగ్ స్కిల్స్ పై ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్…

Also Read: వర్షాకాలంలో జలుబు, దగ్గుకు మిరియాలు ఇలా వాడండి…!

వాస్తవానికి హిమాన్సు సినీ ఎంట్రీ కి సంబంధించి ఆయనే హిట్ ఇచ్చారు. తన ఫిజికల్ ట్రాన్స్ ఫర్ మెన్ వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రారంభించిన తర్వాత రూమర్లు మొదలయ్యాయి. ఇప్పటికే కొంతమంది దర్శకులు కేటీఆర్ కు కథలు వినిపించినట్లు కూడా తెలుస్తోంది. మంచి స్క్రిప్ట్ తో పాటు దర్శకుడు దొరికితే అధికారిక ప్రకటన విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పొలిటికల్ వర్గాలతో పాటు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. గత నాలుగు రోజులుగా సోషల్ మీడియా హోరెత్తుతోంది. కానీ ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే తనపై జరుగుతున్న ప్రచారంపై హిమాంస స్వయంగా స్పందించారు.

Also Read: లైంగిక దాడి కేసు.. బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తరుణ్ తేజ్‌పాల్

ప్రస్తుతం తన సినిమా ఎంట్రీ కి సంబంధించి జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. సినిమా ఇండస్ట్రీలోకి తాను అడుగు పెడుతున్నానని వార్తలు పూర్తిగా నిరాధారం అని పేర్కొన్నారు. ఒకవేళ భవిష్యత్తులో అలాంటి నిర్ణయం తీసుకుంటే.. తానే స్వయంగా చెబుతానని చెప్పడం ద్వారా పూర్తి సంకేతాలు ఇచ్చారు. సోషల్ మీడియాలో వచ్చిన రూమర్లను కొట్టిపారేసిన హిమాంశు.. భవిష్యత్తులో మాత్రం సినిమాల్లోకి వచ్చే అవకాశాన్ని పూర్తిగా కొట్టి పారేయలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు