Homeఅంతర్జాతీయంరిక్టర్‌ స్కేల్‌పై 7.6 తీవ్ర‌త‌తో భూకంపం...వ‌ణికిన ద్వీప‌క‌ల్పం...!

రిక్టర్‌ స్కేల్‌పై 7.6 తీవ్ర‌త‌తో భూకంపం…వ‌ణికిన ద్వీప‌క‌ల్పం…!

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్: ఇండోనేసియాలో నేడు 7.6రిక్ట‌ర్ స్కేల్‌పై అత్యంత తీవ్ర‌త‌తో భారీ భూకంపం సంభ‌వించించింది. దీంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. ఈ భూ కంప ప్ర‌భావంతో తీర ప్రాంత న‌గ‌రాల్లో సెక‌న్ల పాటు బ‌లంగా కంపించింది. 7.6 రిక్ట‌ర్ స్కేల్‌పై భూకంపం సంభించిన‌ట్లు భూగ‌ర్భ శాస్ర్త‌వేత్త‌లు తెలిపారు. భూ కేంద్రం స‌ముద్ర మ‌ట్టానికి సుమారు 10 కిలోమీట‌ర్ల లోతులో ఉన్న‌ట్లుగా గుర్తించారు.

సునామీ హెచ్చ‌రిక‌లు…

భూకంప తీవ్ర‌త దృష్ట్యా ఇండోనేసియా వాతావ‌ర‌ణ‌, జియో ఫిజిక్స్ ఏజెన్సీ త‌క్ష‌ణ‌మే సునామీ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. తీర ప్రాంత ప్ర‌జ‌లు ఎత్త‌యిన ప్రాంతాల‌కు వెళ్లాల‌ని అధికారులు ఆదేశించారు. భూకంపం కార‌ణంగా ప‌లు భ‌వ‌నాలు దెబ్బ‌తినగా విద్యుత్, స‌మాచార వ్య‌వ‌స్థ‌లు చాలా చోట్ల నిలిచిపోయాయి.

రంగంలోకి సహాయక బృందాలు…

ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ ఇప్పటికే రంగంలోకి దిగి ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. ప్రాణ నష్టంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా సముద్ర తీరానికి సమీపంలో ఉండవద్దని, ఆస్తి నష్టం అంచనా వేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. ఆఫ్టర్ షాక్స్ (తదుపరి ప్రకంపనలు) వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments