ఢిల్లీ, క్రైమ్ మిర్రర్: నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరె్మిస్-2లో భాగంగా తొలిసారిగా చంద్రుడి కక్ష్యలోకి తొలిసారిగా అంతరిక్షంలో వెళ్లడం మానవ అంతరిక్ష యాత్రలో ఇది ఒక మైలురాయిగా నిలువనుంది. ఐదు దశాబ్దాల తరువాత మనుషులను చంద్రుడి వద్దకే పంపే లక్ష్యంగా ఈ మిషన్‌ను నాసా రూపించింది. కాగా ఈ అంతరిక్ష యాత్రలో నలుగురు వ్యోమగాములు పాల్గొంటుండగా అందులో క్రిస్టియా కోచ్ ఒకరు.
చంద్రుడి కక్ష్యలో తొలిమహిళ గా రికార్డు…
చంద్రుడి కక్ష్యలోకి ప్రయాణించనున్న మొట్టమొదటి మహిళగా క్రిస్టినా కోచ్ చరిత్రలోకెక్కనున్నారు. ఈమె మిషన్‌లో మిషన్ స్పెషలిస్టుగా వ్యవహరిస్తారు. ఈమె గతంలో కూడ అత్యధిక కాలం 328 రోజులు గా గడిపిన మహిళాగా ఈమెకు పేరుంది.వైవిధ్యం: ఈ మిషన్‌లో క్రిస్టినాతో పాటు విక్టర్ గ్లోవర్ (తొలి నల్లజాతీయుడు), జెరెమీ హాన్సెన్ (కెనడా వ్యోమగామి), మరియు రీడ్ వైజ్‌మాన్ లు వెళ్లనున్నారు.
ఆసక్తి రేకెత్తిస్తున్న స్మార్ట్ ఫోన్‌ల వినియోగం…
సాధారణంగా అంతరిక్షంలో భారీ కెమెరాలు, అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరికరాలను వాడుతుంటారు. కానీ ఆర్టెమిస్-2 యాత్రలో వ్యోమగాములు తమ వెంట స్మార్ట్‌ఫోన్లను తీసుకెళ్లనున్నారు. చంద్రుడికి అత్యంత సమీపంలో ఉన్నప్పుడు కిటికీల గుండా అద్భుతమైన దృశ్యాలను సాధారణ ఫోన్ కెమెరాలతో చిత్రీకరించడానికి వీటిని వాడుతున్నారు. టెక్నాలజీ టెస్టింగ్: నేటి స్మార్ట్‌ఫోన్లలో ఉన్న పవర్‌ఫుల్ ప్రాసెసర్లు మరియు సెన్సార్లు అంతరిక్ష రేడియేషన్‌ను ఎలా తట్టుకుంటాయో పరీక్షించడం నాసా ఉద్దేశ్యం.ఈ ఫోన్ల ద్వారా వ్యోమగాములు తమ వ్యక్తిగత అనుభవాలను నమోదు చేసుకోవడానికి, భూమిపై ఉన్న కుటుంబ సభ్యులతో సులభంగా సంభాషించడానికి అవకాశం ఉంటుంది.
పది రోజుల అనంతరం భూమి పైకి…
వీరు చంద్రుడి ఉపరితలంపై దిగరు. చంద్రుడి చుట్టూ ప్రదక్షిణ చేసి సుమారు 10 రోజుల తర్వాత భూమికి తిరిగి వస్తారు.ఈ మిషన్ విజయవంతమైతే, ఆర్టెమిస్-3 ద్వారా మనుషులను నేరుగా చంద్రుడి ఉపరితలంపై దించుతారు. ఈ మిషన్‌లో ఒక మహిళ, ఒక నల్లజాతీయుడు ఖచ్చితంగా ఉండనున్నారు.ఈ యాత్రలో వీరు భూమి నుంచి సుమారు 3,70,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తారు.
