ఢిల్లీ, క్రైమ్ మిర్రర్: పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్దం తారాస్థాయికి చేరుకుంది. యుద్దం పై డొనాల్డ ట్రంప్ పరస్సర విరుద్ద వ్యాఖ్యలు చేశారు. మేము నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకున్నామని ఇంకా దాడులు కొనసాగుతాయని తెలిపారు. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికా తన ప్రధాన లక్ష్యాలను విజయవంతంగా చేరుకున్నామని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ పూర్తిగా బలహీన పడే వరకు యుద్దం కొనసాగుతుందని తెలిపారు.
ఇరాన్‌కు తీవ్రనష్టం జరిగిందని తెఎలిపపారు. ఇరాన్ కీలక నేతలను అంతం చేశామని తెలిపారు.ఈ యుద్దం ఫిబ్రవరి చివరి నెలలో ప్రారంభమై చివరి ఘట్టంగా చేరుకున్నాయని తెలిపారు. అమెరికా భద్రత కోసం ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అవసరమన్నారు. ఇరాన్ అణ్వయుధాలు తయారుచేయకుండా చేశామని, ఇరాన్లో అధికార మార్పిడి కూడా జరిగిందని ట్రంప్ చెప్పుకొచ్చారు.
47 ఏళ్లుగా అమెరికా, ఇజ్రాయెల్ అంతం కావాలని ఇరాన్ కోరుకున్నదని చెప్పారు. అమెరికాను శక్తివంతమైన దేశంగా మారుస్తున్నామని, ఇరాన్ తాను చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తోందని ట్రంప్ అన్నారు.’నా పాలనలో ఎన్నో విజయాలను సాధించాం.. గత అధ్యక్షులు చేసిన తప్పులను సరిచేస్తున్నా.’ అని ట్రంప్ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై అతిపెద్ద దాడి జరిగిందన్న ట్రంప్.. అది 45 వేల మంది పౌరుల మృతికి కారణమైందని వెల్లడించారు.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఇరాన్‌పై యుద్ధం ప్రకటించామని వివరణ ఇచ్చారు. హర్మూజ్ జలసంధిని ఇరాన్ కోసమే వినియోగించుకోవచ్చని, హర్మూజ్ జలసంధి నుంచి అమెరికాకు ఎలాంటి చమురు అక్కర్లేదని కూడా ట్రంప్ పునరుద్ఘాటించారు. ‘మా దేశంలోనే పుష్కలంగా చమురు నిక్షేపాలు ఉన్నాయి. సంక్షోభం ముగిశాక హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుంది. అతి త్వరలో యుద్ధం సమాప్తమవుతుంది’ అని ట్రంప్ ప్రకటించారు.
ఇరాన్‌ను రాతియుగంగా మారుస్తాం…
ఇరాన్‌ను అన్ని విధాలుగా రాతియుగంగా మారుస్తామని తెలిపారు. ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.వియత్నాం యుద్ధం ముగియడానికి 19 ఏళ్లు పట్టిందని, అమెరికన్ల భవిష్యత్ కోసమే ఈ యుద్ధం చేస్తున్నామని ట్రంప్ వెల్లడించారు. 2-3 వారాల్లో భీకరదాడులు చేస్తామని, యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదని ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలు నష్టపోకుండా కూడా చర్యలు తీసుకుంటామని, సౌదీ, కువైట్, బహ్రెయిన్‌కు భద్రత కల్పిస్తామని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించే సామార్థ్యం తగ్గిపోయిందని తెలిపారు. చివరిగా, డీల్(రాజీ) కుదరకపోతే ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ట్రంప్ తన ప్రసంగంలో హెచ్చరించారు.
