Homeఆంధ్ర ప్రదేశ్చేనేత కుటుంబాల్లో ఉచిత వెలుగులు....సీఎం చంద్ర‌బాబు...!

చేనేత కుటుంబాల్లో ఉచిత వెలుగులు….సీఎం చంద్ర‌బాబు…!

ఉదయగిరి, క్రైమ్ మిర్ర‌ర్‌: చేనేత కుటుంబాల్లో ఉచిత విద్యుత్తు అందించి వారి ఇండ్ల‌లో వెలుగులు నింప‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీని కాకుండా బాధ్య‌త‌గా తీసుకున్న నేడు చేనేత సోద‌రుల‌కు ఉచిత విద్యుత్ ప‌థ‌కం అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపారు మగ్గం ఆడితేనే ఇంట్లో దీపం వెలిగే నేతన్నల కష్టాన్ని అర్థం చేసుకుని ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.93 వేల చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, 11,488 మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఈరోజు నుంచే అమల్లోకి వస్తోంది. విద్యుత్ను రాయితీగానే కాదు ఒక్కో నేతన్న కష్టానికి ఇస్తున్న గౌరవం.

వారి వృత్తికి కలిగిస్తున్న భరోసా. ఏడాదికి రూ.150 కోట్లు ఖర్చవుతున్నా అంతకంటే ప్రభుత్వానికి ముఖ్యమైనది నేతన్నల చిరునవ్వు అని ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి రూ.8 వేల నుంచి రూ.21 వేల దాకా ఆదా కలిగించడంతో పాటు వారి జీవన స్థాయిని మెరుగుపరచేందుకు వేసిన పెద్ద అడుగు అని పేర్కొన్నారు. చేనేత వస్త్రాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేలా బ్రాండ్ కల్పిస్తూ అమ్మకాలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. మగ్గం దగ్గర కూర్చుని జీవితాన్ని నెట్టుకొస్తున్న ప్రతీ నేతన్నకు ప్రభుత్వం చెబుతున్న మాట… మీరు నేస్తున్నది కేవలం వస్త్రం కాదు… మన సంస్కృతి. చేనేత కుటుంబాల అభ్యున్నతే లక్ష్యంగ వారి కష్టానికి తోడుగా నిలబడేందుకు ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments