Homeక్రైమ్అమాంతంగా పెరిగిన గ్యాస్ ధ‌ర‌లు...వినియోగ దారుల‌కు త‌ప్ప‌ని తిప్ప‌లు...!

అమాంతంగా పెరిగిన గ్యాస్ ధ‌ర‌లు…వినియోగ దారుల‌కు త‌ప్ప‌ని తిప్ప‌లు…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్: ప‌శ్చిమాసియా యుద్దం కార‌ణంగా గ్యాస్ కొర‌త దేశంలో ప‌ట్టి పీడిస్తుంది. వంట గ్యాస్ ధ‌ర‌లు అమాంతంగా పెరిగాయి. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు పెరిగాయి దీంతో వంటగ్యాస్ వినియోగదారులకు షాక్ తగిలింది. . ఒక్కో సిలిండర్‌పై ఏకంగా రూ.195. 50 పైసలు పెరిగాయి. ఈ ధరలు ఈ తెల్లవారు జాము నుంచే అమలులోకి వచ్చాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే చమురు కంపెనీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు.

నాలుగు నెల‌ల్లో ధ‌ర‌లు పెర‌గ‌డం ఐదోసారి…

క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ ధ‌ర‌లు పెర‌గ‌డం రెండోసారి కాగా గ‌త నెల మార్చి 1న రేట్లు పెరిగా ఒక్కోదానిపై 28 రూపాయ‌లు పెరిగాయి.
నాలుగు నెలల్లోనే ఐదోసారి ధరలు పెరిగాయి. ఇప్పుడు తాజాగా మరో 195 రూపాయల మేర అదనపు భారం వినియోగదారులపై పడింది. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుంది. ముఖ్యంగా హోటళ్ళు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెరుగుద‌లా ఇలా…

ఢిల్లీ, కోల్‌క‌తా, హైద‌రాబాద్ వంటి ప్ర‌ధాన న‌గ‌రాల్లో వీటి పెంపు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. కాగా తాజా ధ‌ర‌ల పెరుగ‌ద‌ల‌తో వినియోగ‌దారుల‌పై మ‌రింత ఒత్తిడి పెంచుతుంది. ఓక్కోసిలిండ‌ర్‌పై ఏకంగా 2వేల వ‌ర‌కు చెల్లించాల్సి వ‌స్తుంది.దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 195.50 పైసల మేర పెరిగింది. ఇప్పుడు రూ. 2,078.50కి చేరింది. ప్రస్తుత ఏడాదిలో ఢిల్లీలో మొత్తం రూ. 498 పెరుగుదల కనిపించింది. కోల్‌కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర అత్యధికంగా 218 పెరిగింది.

రూ. 2,208కు చేరుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇక్కడ మొత్తం 524 రూపాయల పెరుగుదల కనిపించింది. ముంబైలో కమర్షియల్ సిలిండర్ ధర 196 పెరిగి, రూ. 2031కి చేరుకుంది. తొలి మూడు నెలల కాలంలో ఇక్కడ పెరిగిన రేటు రూ. 499.50 పైసలు.చెన్నైలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర 203 రూపాయల మేర పెరిగింది. ఈ పెంపుతో ఇక్కడ ఇప్పటివరకు 507 రూపాయల మేర పెరుగుదల చోటు చేసుకుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments