Homeక్రైమ్గాలివాన భీభ‌త్స‌వం....రైత‌న్న‌కు అపార న‌ష్టం...!

గాలివాన భీభ‌త్స‌వం….రైత‌న్న‌కు అపార న‌ష్టం…!

మంచిర్యాల, క్రైమ్ మిర్ర‌ర్‌ :ఒక ప‌క్క ఎండ‌లు, మ‌రొక ప‌క్క ఈదురు గాలులు, ఉరుముల‌తో కూడిన వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. సోమ‌వారం రాత్రి కురిసిన భారీ వ‌ర్సాల‌కు ప‌లు జిల్లాల్లో చేతికొచ్చిన పంట‌లు నేల‌రాలాయి. రైతుల‌కు అపార న‌ష్టం వాటిల్లింది.మంచిర్యాల జిల్లాలో కురిసిన ఈదురు గాలుల‌తో కురిసిన వ‌ర్సానికి ప‌లు పంట‌లు నేల‌రాలాయి. ఆరు గాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన సమయంలో గాలివాన తుడుచుకు పెట్టుకపోయింది.

జ‌న్నారం మండలంలోని దేవునిగూడ, చామన్ ప‌ల్లితో పలు గ్రామాల్లో మామిడిపంటలు నేలరాలగా మండలంలో మొక్కజొన్న 419 ఎకరాల్లో నేలకొరిగిందని, వరి ధాన్యం సుమారు 5ఎకరాలపైన నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిపారు.211 మంది రైతులకు నష్టం వాటిల్లిందని తెలిపారు . కాగా చెన్నూర్‌లో కురిసిన భారీ వ‌ర్షాల‌కు మామిడి, వ‌రి పంట‌లు నేల‌రాల‌డంతో ఆర్థికంగా తీవ్రంగా న‌ష్టోయామ‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ప్ర‌భుత్వం స్పందించి రైతుల‌కు న‌ష్ట‌ప‌రిహారం అందించాల‌ని కోరుతున్నారు. అదే విధంగా జ‌గిత్యాల జిల్లాలో వ‌ర్షాల‌కు చింత‌, వ‌రి, మొక్క జొన్న‌లు నేల‌రాలాయి. అదే విధంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఈదురు గాలుల‌తో కూడిన వ‌ర్షానికి మామిడి, వ‌రి, పంట‌లు నేల‌కొరిగాయి. క‌ల్లాల్లో ఉన్న ధాన్యం వ‌ర్షాల‌కు త‌డిసిముద్ద‌యింద‌ని ప‌లువురు రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments