మంచిర్యాలక్రైమ్ మిర్రర్: పట్టణంలోని ప్రాణహిత కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి ఎగ్గటి రాజేశ్వర్రావుకు హైదరాబాద్ కు చెందిన తారా ఆర్ట్స్ అకాడమి నల్లవజ్రం అవార్డును తారా ఆర్ట్స్ అకాడమి వారు అందజేశారు. సోమవారం గోదావరిఖనిలో ఆర్‌కే గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్ట్స్ వ్యవస్థాపకులు సంకే రాజేశ్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.
రాజేశ్వర్రావు క్రమశిక్షణతో విధులు నిర్వహిసూ నే మరోవైపు సింగరేణి కమ్యూనికేషన్ సెల్లో కళాకారుడిగా ఉద్యోగ చైతన్య ప్రదర్శనలు, సిం గరేణిలో ఉత్పత్తి రక్షణపై అనేక ప్రదర్శనలతో పాటు కాంగో వాయిద్య కళాకారుడితో పాటు వివిధ నాటక ప్రదర్శనలు చేసిన సేవలకు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డు సాధించడం పట్ల మంగళవారం మందమర్రి ఏరియాలోని ఆయన పని చేస్తున్న వర్కుషాపులో సహోద్యోగులు ఆయనను అభినందించి ఆయనను స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రాజేశ్వర్రావు మాట్లాడుతూ ఏరియా జీఎం రాధాక్రిష్ణతో పాటు తోటి ఉద్యోగుల సహ క ళాకారుల ప్రోత్సహం తోనే ఈ అవార్డు దక్కిందని తెలిపారు. సమాజంలో ప్రజారోగ్యం, దూమపానం, మద్యపానం; మత్తు పదార్థాలపై వల్ల జరిగే అనర్థాలపై ప్రదర్శనలు ఇస్తున్నామని కళా కోసం కాదని ప్రజల కోసమనే నినాదంతో ముందుకు వెళ్తున్నానని తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో తోటి ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు.
