Homeఆంధ్ర ప్రదేశ్అలర్ట్..!ఓవైపు పిడుగులు, మరోవైపు వడగాలులు?

అలర్ట్..!ఓవైపు పిడుగులు, మరోవైపు వడగాలులు?

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకవైపు పిడుగులతో కూడిన వర్షాలు మరోవైపు బీకరమైన ఎండల కారణంగా పలు జిల్లాలలో వడగాలులు వీస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు భిన్న వాతావరణం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ద్రోణి ప్రభావం కారణంగా పలు జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు పడవచ్చు అని APSDMA వెల్లడించింది. మరి కొన్ని జిల్లాలలో వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి అని స్పష్టం చేసింది.

పిడుగులతో కూడిన వర్షాలు పడే జిల్లాలు :
1. శ్రీకాకుళం
2. అల్లూరి సీతారామరాజు
3. పోలవరం
4. కర్నూల్
5. నంద్యాల
6. విజయనగరం
7. మన్యం
8. విశాఖపట్నం
9. నెల్లూరు
10. అనంతపురం

వడగాలులు వీచే జిల్లాలు :-
1. మన్యం
2. పోలవరం
3. విజయనగరం
4. తూర్పుగోదావరి
5. ఏలూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు చాలా అంటే చాలా ప్రముఖంగా ఉండాలి అని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ భిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యంగా రైతులు, వృద్ధులు మరియు గర్భిణీలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. ఉదయం మరియు సాయంత్రం తప్ప మధ్యాహ్నం సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దని అధికారులు చెబుతున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు