Homeక్రైమ్అత్తాపూర్‌లో దారుణం...మ‌తిస్థిమితం లేని యువ‌తిపై అత్యాచారం...!

అత్తాపూర్‌లో దారుణం…మ‌తిస్థిమితం లేని యువ‌తిపై అత్యాచారం…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్ః హైద‌రాబాద్‌లోని హైద‌రాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ప‌సి మొగ్గ‌ల నుంచి మొద‌లు కొని 60ఏళ్ల వృద్దుల వ‌ర‌కు దేశంలో ఎక్క‌డో ఒక చోట కామాందుల చేతిలో బ‌ల‌వుతూనే ఉన్నారు. నేడు స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకునేలా అత్తాపూర్‌లో అమానుషం చోటు చేసుకుంది. హైద‌రాబాద్‌ న‌గ‌రంలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హాసన్ నగర్‌లోఈ దారుణ ఘ‌ట‌న వెలుగు చూసింది.

కనీసం తనపై జరుగుతున్న దాడిని కూడా అర్థం చేసుకోలేని, తన గోడును ఎవరికీ చెప్పుకోలేని ఒక మతిస్థిమితం లేని యువతిపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. యువతి ఒంటరిగా ఉండ‌డాన్ని గమనించిన ఒక యువకుడు ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు.

అనంతరం అక్కడ నుంచి పారిపోయాడు. ఇంటికి చేరుకున్న కుటుంబ‌ సభ్యులు యువతి పరిస్థితి గమనించి అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిదింతుడు అదే ప్రాంతానికి చెందిన అఖిల్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం యువతిని ఆస్పత్రికి తరలించారు.

తాజావార్తలు