Homeతెలంగాణతెలంగాణ‌లో ఉరుముల‌తో కూడిన‌ వ‌ర్షాలు... ఆ జిల్లాల్లో ఎల్లో అల‌ర్ట్‌...!

తెలంగాణ‌లో ఉరుముల‌తో కూడిన‌ వ‌ర్షాలు… ఆ జిల్లాల్లో ఎల్లో అల‌ర్ట్‌…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలుల‌తో, పిడుగులు, మెరుపుల‌తో వ‌ర్షాలు ప‌డ‌నున్న‌ట్లు పేర్కొంది. మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్‌, ఆదిలాబాద్‌, కొమ‌రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల‌, నిర్మ‌ల్, నిజామాబాద్‌, సిద్దిపేట‌, యాదాద్రి భువ‌న‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డిలో ఎల్లో హ‌ల‌ర్ట్ జారీ చేశారు.

అదే విధంగా హైద‌రాబాద్‌లో ఆక‌శం పాక్షికంగా మేఘావృత‌మై సాయంత్రం లేదా రాత్రి స‌మ‌యాల్లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది.  వ‌ర్షాల దృష్ట్యా ఉరుముల మెరుపుల స‌మ‌యంలో చెల్ల కింద లేదా విద్యుత్ స్తంభాల వ‌ద్ద ఉండ‌వ‌ద్ద‌ని అధికారులు సూచించారు.బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఉండే వారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించింది. కాగా అల్ప ద్రోణి ప్ర‌భావంతో ఎండ‌ల నుంచి కొంచం ఉప‌శ‌మ‌నం క‌లుగనున్న‌ట్లు పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments