Homeఆంధ్ర ప్రదేశ్నీటిలో మునిగి ఇద్ద‌రు యువ‌కుల మృతి...మున‌గ‌పాక‌లో తీవ్ర విషాదం...!

నీటిలో మునిగి ఇద్ద‌రు యువ‌కుల మృతి…మున‌గ‌పాక‌లో తీవ్ర విషాదం…!

అనకాపల్లి, క్రైమ్ మిర్ర‌ర్‌ :స్నానానికి వెళ్లిన ఇద్ద‌రు యువ‌కులు నీటిలో మునిగి మృతి చెందిన ఘ‌ట‌న తీవ్ర విషాదం నింపింది. మున‌గాప‌క మండ‌లం ఉమ్మ‌లాడ బ్రిడ్జీ స‌మీపంలో స్నానానికి వెళ్లిన ఇద్ద‌రు యువ‌కులు ఈత రాక‌పోవ‌డంతో నీటిలో మునిగిపోయి చ‌నిపోయారు. మునగపాక మండలం ఉమ్మలాడ బ్రిడ్జి సమీపంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు… ఈత రాకపోవడంతో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

మృతులు అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ సాయి నగర్ ముత్రాసు కాలనీకి చెందిన చింతా రోహిణి కుమార్(26),తాడి హర్ష వర్ధన్‌(24) గుర్తించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్విమ్మర్ల సహాయంతో మృతదేహాలను వెలికితీసి అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు.వీరు మృతి చెంద‌డంతో ఆ ప్రాంతమంత విషాదంలో మునిగింది. వారి త‌ల్లిదండ్రుల రోద‌న‌లు ప‌లువురిని కంట‌త‌డిపెట్టించాయి.

తాజావార్తలు