Homeఅంతర్జాతీయంట్రంప్ అనుకున్న ప‌ని చేశాడు...ఖ‌ర్గ్ ఐలాండ్ స్వాధీనం...!

ట్రంప్ అనుకున్న ప‌ని చేశాడు…ఖ‌ర్గ్ ఐలాండ్ స్వాధీనం…!

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్ః ప‌శ్చిమాసియాలో రోజుకు తీవ్ర ఉద్రిక్త‌లు చోటు చేసుకుంటున్నాయి. యుద్దం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. తాజాగా అమెరికా ర‌క్ష‌ణ బ‌ల గాలు ఇరాన్‌కు ఆర్థికంగా మూల‌స్తంభ‌మైన ఖ‌ర్గ్ ఐలాండ్ ను స్వాధీనం చేసుకున్న‌ట్లు నివేద‌క‌లు వ‌స్తున్నాయి.కాగా అమెరికా దళాలు ఇరాన్‌పై వ్యూహాత్మక దాడులను వేగవంతం చేశాయి.

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా వైమానిక, నౌకాదళాలు భారీ దాడులకు దిగాయి. ఈ క్రమంలో ఇరాన్‌కు చెందిన అత్యంత ప్రధానమైన చమురు ఎగుమతి కేంద్రం ‘ఖార్గ్ ఐలాండ్’ను అమెరికా దళాలు తమ స్వాధీనంలోకి తీసుకున్నట్లు నివేదికలు అందుతున్నాయి.

ఖార్గ్ ఐలాండ్ స్వాధీనం!

ప్ర‌పంచ దేశాల‌కు చ‌మురు 90శాతం ఖ‌ర్గ్ ఐలాండ్ నుంచే ఎగుమ‌తి అవుతుంది. దీనిని స్వాధీనం చేసుకుంటే ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బ‌కొట్ట‌వ‌చ్చున‌ని అమెరికా భావిస్తుంది. రాబోయే కొన్ని రోజుల పాటు ఇరాన్‌లో భూత‌ల దాడుల‌కు అమెరికా సిద్ద‌మైన‌ట్లుగా తెలుస్తుంది. ఇందు కోసం అమెరికా అద‌న‌పు బ‌ల‌గాల‌ను రంగంలోకి దింపింది.

హ‌ర్మూజ్ వ‌ద్ద నిరంత‌రం దాడులు…

ఈ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ గతంలో హెచ్చరించిన నేపథ్యంలో, అక్కడ పట్టు సాధించేందుకు అమెరికా నౌకాదళం నిరంతర దాడులు చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఇరాన్ అనుబంధ సంస్థలు గల్ఫ్ దేశాల్లోని చమురు ప్లాంట్లు, అమెరికా స్థావరాలపై దాడులు చేస్తున్నాయి. వీటికి ప్రతిచర్యగా అమెరికా నేరుగా ఇరాన్ భూభాగంపైనే దాడులకు దిగడం అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది. దీంతో ఐక్యరాజ్యసమితి, ఇతర దేశాలు శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, ఉద్రిక్తతలు మాత్రం తగ్గడం లేదు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments