Saturday, March 28, 2026
Homeక్రైమ్హెల్మెట్ ధరించి ప్రమాదాలలో రక్షణ పొందండి... కోదాడ డివిజనల్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి.

హెల్మెట్ ధరించి ప్రమాదాలలో రక్షణ పొందండి… కోదాడ డివిజనల్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి.

కోదాడ, క్రైమ్ మిర్ర‌ర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యచరణ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కోదాడ పట్టణంలో కోదాడ పట్టణ పోలీసులు ట్రాఫిక్ పోలీసులు ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ వినియోగం పై అవగాహన ర్యాలీని నిర్వ‌హించారు. కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీని కోదాడ సబ్ డివిజనల్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ శివశంకర్ తో కలిసి ప్రారంభించారు.

ర్యాలీ ఖమ్మం క్రాస్ రోడ్డు నుండి రంగా థియేటర్ క్రాస్ రోడ్డు వరకు నిర్వహించి స్థానిక ప్రజలకు, వాహనదారులకు, స్థానిక వ్యాపారులకు హెల్మెట్ వినియోగం పట్ల అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కోదాడ డివిజన్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం వల్ల అనుకోని రోడ్డు ప్రమాదాలలో ప్రాణాపాయం నుండి రక్షణ పొందవచ్చునని సూచించారు. ద్విచక్ర వాహనంపై కూర్చునే వారు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని అన్నారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత హెల్మెట్ వినియోగం అవగాహన ర్యాలీని నిర్వహించామని తెలిపారు. ప్రతి పౌరుడు, ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతా నియమాల పట్ల, సురక్షిత ప్రయాణం పట్ల, రహదారుల వినియోగం పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు. ప్రతి ప్రయాణం సురక్షిత గమ్యం చేరడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ప్రజలకు రోడ్డు నియమాల పట్ల, జాగ్రత్తల పట్ల విస్తృతంగా అవగాహన కల్పిస్తుందని ప్రజలు వాహనదారులు గమనించాలని కోరారు. వాహనదారులు వాహనాలు నిదానంగా నడపాలని అన్నారు.

ఈ ర్యాలీ నందు పట్టణ ఇన్స్పెక్టర్ శివశంకర్, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి, పట్టణ ఎస్ఐ సుధీర్, పోలీసు సిబ్బంది స్థానిక పౌరులు పెద్దలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments