Saturday, March 28, 2026
Homeతెలంగాణశ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి హుండీ ఆదాయం లెక్కింపు..!

శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి హుండీ ఆదాయం లెక్కింపు..!

  • శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి హుండీ ఆదాయం లెక్కింపు..!

  • మొత్తం హుండీ ఆదాయం 48 వేల 549 రూపాయలు..

  • ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సదుపాయాల కోసం కృషి చేస్తాము

  • దేవాలయం చైర్మన్ బ్రేమ్మదేవరా విద్యాసాగర్ వెల్లడి

క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, వేములపల్లి, మార్చి 26: నల్గొండ జిల్లా, వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలోని శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానం అధికారులు, దేవాలయం అర్చకులు మణిశర్మ, గ్రామ పెద్దలు, భక్తుల సమక్షంలో హుండీని తెరిచి లెక్కింపు చేపట్టారు.

ఈ సందర్భంగా భక్తులు సమర్పించిన నగదు, నాణేలు వంటి కానుకలను వేరు చేసి నమోదు చేశారు. దేవాలయం చైర్మన్ విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారంగా… ఈసారి హుండీ ద్వారా 48 వేల 549 రూపాయల ఆదాయం లభించినట్లు తెలిపారు. గత సంవత్సరం జాతరలో 24 వేల 411 రూపాయల ఆదాయం లభించినట్లు తెలిసిందే.

శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి హుండీ ఆదాయం లెక్కింపు..!
శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి హుండీ ఆదాయం లెక్కింపు..!

అయితే ఇటీవల ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, ఉత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీ పెరగడం వల్ల ఆదాయం కూడా రెట్టింపు గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సదుపాయాల కల్పనకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు..

కార్యక్రమంలో దేవాదాయ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ కొంకపాక మృతుంజయ్ శాస్రి, దేవాదాయ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి, గ్రామా సర్పంచ్ పిల్లల సందీప్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు స్వరాజ్య లక్ష్మి, ధర్మకర్తలు లింగయ్య, జానీ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments