క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :- మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా భారతదేశ వ్యాప్తంగా వంటగ్యాస్ కొరత ఏర్పడిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే పలుచోట్ల గ్యాస్ కొరత లేకపోయినప్పటికీ ఇంకొన్ని చోట్ల మాత్రం చాలా మంది ప్రజలు ఈ గ్యాస్ కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో కొన్ని వందల సంఖ్యలో జనం గ్యాస్ కోసం క్యూ లైన్ లో నించోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాక ఈరోజు రంజాన్ కావడంతో ఎంతోమంది ముస్లిం లు గ్యాస్ సిలిండర్లను పట్టుకొని క్యూ లైన్ లో నించున్నారు. పండగ పూట కావడంతో చాలా మంది వివిధ వంటకాలు చేసుకుంటూ ఉంటారు. కానీ కొంతకాలంగా సిలిండర్ల సరఫరా లేకపోవడంతో ప్రజలు తిప్పలు పడుతున్నారు. ప్రభుత్వాలు వీటిపై ఏదో ఒక విధంగా ఆలోచనలు ప్రజలు ఇబ్బందులు పడకుండా గ్యాస్ సరఫరా జరిగేలా చూడాలని అంటున్నారు. ఇప్పటికే చాలామంది గ్యాస్ను వినియోగించడం బదులు పలు గ్రామాల్లోని ప్రజలందరూ కూడా కట్టెలను ఉపయోగిస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరికి కూడా పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. పట్టణాలలో కట్టెలకు బాగా డిమాండ్ కూడా పెరగడంతో కొంతమంది దీనినే వృత్తిగా మార్చుకుంటున్నారు.
మంజీరా నదిలో కాలుష్యంతో చేపలు మృతి.. సిపిఎం ఆగ్రహం
Donkey Farming: గాడిదలు పెంచితే రూ.50 లక్షలు.. కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే ఆఫర్!
