రేవంత్ తో కరచలనం చేస్తారా..?
జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం..
మహిళా నేతకు షాక్ తప్పదా..?
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ బ్యూరో: వైయస్సార్ కాంగ్రెస్ మాజీమంత్రి రోజాకు కొత్త ప్రమాదం ఎదురయింది.. ఆమెను పార్టీ నుంచి సాగనంపుతారు అన్న ప్రచారం నడుస్తోంది. దానికి కారణం లేకపోలేదు. ఆమె తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇచ్చారు.
సహజంగా ఇది జగన్మోహన్ రెడ్డికి నచ్చదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తన మిత్రుడు కేసీఆర్ కు శత్రువు. ఆపై తన శత్రువు చంద్రబాబుకు సన్నిహితుడు. అటువంటి రేవంత్ తో కరచలనం చేశారు రోజా. అందుకే రోజాకు మున్ముందు కష్టాలు తప్పవని స్పష్టం అవుతుంది.
ఎందుకంటే గతంలో రేవంత్ ఇచ్చిన విందుకు హాజరైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు శంకరగిరి మాన్యాలు పట్టించారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మాజీ మంత్రి రోజాకు అదే పరిస్థితి వస్తుందన్న టాక్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తోంది.
ఢిల్లీలో సీఎం రేవంత్..
ప్రస్తుతం ఢిల్లీ టూర్ లో ఉన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆయన పార్లమెంటుకు వెళ్లారు ఏదో పనిమీద. ఆ సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి ఆర్కే రోజా ఎదురుపడ్డారు. ఒకప్పుడు ఈ ఇద్దరు టిడిపిలో పనిచేసిన వారే. ఆపై సినీ యాక్టర్. పైగా మహిళా నేత. అందుకే రేవంత్ రెడ్డి చెల్లమ్మ అంటూ పలకరించారు.
ఆయనే కాదు కొత్తగా రాజ్యసభకు తెలంగాణ నుంచి ప్రమోట్ అయిన ఏం నరేందర్ రెడ్డి కూడా రోజమ్మ అంటూ పలకరించారు. దీంతో రేవంత్ రెడ్డి తో పాటు నరేందర్ రెడ్డి కి ఆమె షేక్ హ్యాండ్ ఇచ్చారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె బయటకు వెళ్లడమో.. లేకుంటే బలవంతంగా బయటకు పంపడం జరగడం ఖాయమన్న ప్రచారం నడుస్తోంది. 2023లో తెలంగాణకు సీఎం గారు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.
ఆ సమయంలో ఆయనకు శుభాకాంక్షలు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి. పైగా కొడాలి నాని లాంటి వారు మాకు అవసరం అనుకుంటే సోనియా గాంధీతో మాట్లాడుకుంటాం తప్ప.. రేవంత్ రెడ్డి తో తమకు పని ఏం అన్నట్టు మాట్లాడారు.
పైగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఎంపీలకు ఇచ్చిన విందుకు హాజరైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులకు తలంటారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత వారికి ఎంపీ సీట్లు కూడా దక్కలేదు. ఇప్పుడు రోజాకు అదే పరిస్థితి వస్తుందన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
విభిన్న రాజకీయం..
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో స్పష్టమైన గీత కనిపిస్తోంది. చంద్రబాబుకు వ్యతిరేకి కెసిఆర్. అందుకే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకిగా మారిపోయారు రేవంత్ రెడ్డి. ఎందుకంటే చంద్రబాబుకు వ్యతిరేకి కెసిఆర్.. రేవంత్ రెడ్డి సన్నిహితుడు కావడం జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని విషయం.
అందుకే సాటి తెలుగు రాష్ట్ర సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి కనీసం పలకరించలేదు జగన్మోహన్ రెడ్డి. కేవలం ఆయన చంద్రబాబుకు సన్నిహితుడు అన్న కారణంతోనే పట్టించుకోలేదు జగన్. బద్ద విరోధిగా రేవంత్ ను చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అటువంటి రేవంత్ ఇచ్చిన విందుకు హాజరైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను పక్కన పడేశారు జగన్.
కచ్చితంగా ఇప్పుడు మాజీ మంత్రి రోజాను కూడా అలానే పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే ఆమెను వ్యతిరేకిస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కానీ ఎక్కడో తనను అభిమానిస్తున్నారన్న సాఫ్ట్ కార్నర్ తో రోజాను వెనుకేసుకొచ్చారు.
కానీ అదే రోజా తనకు సన్నిహితుడైన కెసిఆర్ ను వ్యతిరేకించే రేవంత్ రెడ్డిని.. తాను ఆగర్భ శత్రువుగా భావించే చంద్రబాబుకు సన్నిహితుడైన తెలంగాణ సీఎంతో కారచలనం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటారా? కచ్చితంగా రోజాపై వేటు వేయడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ దక్కకపోవడం అంతకంటే నిజం. చూడాలి మరి ఏం జరుగుతుందో?
