గోదావరిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు
గజ ఈతగాళ్లతో గాలింపు
మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం
భద్రాద్రి కొత్తగూడెం, క్రైమ్ మిర్రర్: సెలవులు కావడంతో విహార యాత్రకని వచ్చిన విద్యార్థులు గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన విద్యార్థులు నీటిలో మునిగి గల్లంతైన ఘటన జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో ఎస్ ఆర్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజికి చెందిన ఏడుగురు విద్యార్థులు సెలువుల నేపథ్యంలో భద్రాచలం పర్యటనకు వచ్చారు.
భద్రాచలం – కూనవరం రహదారిలోని కొల్లుగూడెం ఇసుక ర్యాంపు ప్రాంతంలో గోదావరి నది అందాలను చూసేందుకు వారు వెళ్లారు. ఈ క్రమంలో గోదావరిలో ఈత కొట్టడానికి దిగగా లోతును అంచనా వేయకపోవడం, అదేక్రమంలోనీటి ఉధ్రిత పెరగడంతో నీటిలో కొట్టుకపోయారు. కాగా గట్టపైనే ఉన్న ఇద్దరు వ్యక్తులు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు.
గల్లంతైన విద్యార్థులు…
సమాచారం అందుకున్న పోలీసులు చేరుకొనిసహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసుకొని వివరాలు వెల్లడించారు. గల్లంతైన విద్యార్థులు సతీశ్– మదనపల్లి (చిత్తూరు జిల్లా), నవదీప్ – ఉయ్యూరు (కృష్ణా జిల్లా), తేజజ్ఞ – ఉయ్యూరు (కృష్ణా జిల్లా), అభిరామ్ – భద్రాచలం, శ్రీకర్ – భద్రాచలానికి చెందిన వారిగా గుర్తించారు. వీరిలో ఇద్దరు భద్రాచలానికి చెందిన వారు కాగా, మిగిలిన ముగ్గురు ఏపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారున్నారు.
ముమ్మర గాలింపు…
ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి గల్లంతైన విద్యార్థుల కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోట్ల సహాయంతో నదిలో గాలిస్తున్నాయి. కాగా ప్రాంతంలో ఇసుక తవ్వకాల వల్ల లోతైన గోతులు ఉన్నాయని, అందుకే విద్యార్థులు ప్రమాదంలో చిక్కుకున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులు మృతి చెందారనే విషయం తెలియగానే వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యార్థులు నీటిలో మునిగిపోవడంతో ఆ ప్రాంతమంతా తీవ్ర విషాదం నెలకొంది.
