Friday, March 20, 2026
Homeఅంతర్జాతీయంయుద్దంలోని ఉత్తర కొరియా ఎంట్రీ....ఇక విధ్వంస‌మే...!

యుద్దంలోని ఉత్తర కొరియా ఎంట్రీ….ఇక విధ్వంస‌మే…!

  • అమెరికాను వ్యూహాత్మ‌కంగా దెబ్బ‌కొడుతున్న ఇరాన్‌

 

టెహ్రాన్. క్రైమ్ మిర్ర‌ర్: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం మొదలై 18 రోజులు కావ‌స్తున్న యుద్దం ముగిసేప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. ఒక‌రిపై ఒక‌రు బాంబులు, క్షిపుణుల‌తో దాడులుచేస్తూనే ఉన్నారు. చ‌మురు క్షేత్రాలు ల‌క్ష్యంగా ఇరాన్ సైతం మిస్సైల్ల‌తో దాడులు చేస్తుంది. ఇరాన్ గ‌ల్ఫ్ దేశాల‌న టార్గెట్ చేస్తుంది. ప‌శ్చిమాసియాలో పరిస్థితులు అల్ల‌క‌ల్లోలంగా త‌యారైంది. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ జీవ‌నాడి యిన చ‌ముర క్షేత్రాల‌పై బీక‌ర దాడులుచేస్తూ విద్వంసం చేస్తుంది.

కాగా ఇంతలా ప్రతిఘటిస్తామని ఇరాన్, ఇంతకాలం యుద్ధం చేయాల్సి వస్తుందని అమెరికా కూడా అంచనా వేయలేదు. కానీ ఇరాన్‌ అమెరికాను భయపెడుతోంది. వ్యూహాత్మకంగా అమెరికాను దెబ్బతీస్తోంది. అమెరికాపై ఒత్తిడి తెస్తోంది. ఈ తరుణంలో హార్మూజ్‌ జలసంధి వద్ద నౌకలు నిలిచిపోయాయి. ఇలాంటి తరుణంలో యురోపియన్‌ యూనియన్‌ దేశాలకు చమురు సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో అమెరికా యుద్ధంతో తమతో కలిసి రావాలని నాటో దేశాలను కోరినా ఎవ‌రుముందుకు రాక‌పోయిన యుద్దంకొన‌సాగిస్తుంది.

ఇరాన్‌కు మ‌ద్ద‌తుగా ఉత్త‌ర కొరియా …?

ఈ వార్‌లోకి ఉత్తర కొరియా ఎంటర్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే యుద్ధం లక్ష్యం ఏమిటో ఎన్నాళ్లు కొనసాగుతుందో అమెరికా అంచనా వేయలేకపోతోంది. ఈ తరుణంలో ఉత్తర కొరియా రంగంలోకి దిగితే అమెరికాకు ఇబ్బందలు తప్పవు. ఎందుకంటే ఉత్తర కొరియా అణ్వాయుధ దేశం. ఉత్త‌ర కొరియా ఎంట‌ర్ అయితే ఇక విధ్వంస‌మే అని ప‌లు దేశాలు ఆందోళ‌న చెందుతున్నాయి.

కాగా దక్షిణ కొరియా అమెరికా మిత్ర దేశం దీనికి ఉత్తర కొరియాతో ఇబ్బందులు ఉన్నా అమెరికా ఆ దేశంపై దాడి చేయకపోవడానికి కారణం అణ్వాయుధ దేశం కేవ‌ల‌మే. కాగా ఇరాన్‌ ’డ్యాన్సింగ్‌ మిస్సైల్‌’ ప్రయోగం (10 వేల కి.మీ. రేంజ్, అర్బిటల్‌ ట్రాజెక్టరీ)తో కొత్త ఆయుధాలు ప్రదర్శించి అమెరికా ఆధిక్యతను సవాల్‌ చేస్తోంది. ట్రంప్‌ అనుకోని ఈ దీర్ఘయుద్ధం ఖర్గ్‌ ఐలాండ్‌ దాడులు తో మరింత తీవ్రమైంది.మరోవైపు ఇరాన్‌ సౌదీ అరేబియాలోని అమెరికా ఎయిర్‌ బేస్‌లో 5 ట్యాంకర్‌ షిప్‌లు ధ్వంసం చేసి యుద్ధ విమానాల ఇంధన సరఫరా (గాల్లో నింపుదల) ఆపేశారు.

ఈ ఆకస్మిక దాడి అమెరికా ఆపరేషన్‌ ’ఎపిక్‌ ఫ్యూరీ’ను ఆపేసి, విమానాలు లక్ష్యాలకు చేరుకోలేకపోయాయి. ఐఆర్‌జీసీ 5 వేల బాంబుల దాడులకు ప్రతిఘటనగా ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు, మోజ్తాబా ఖమేనీపై బెదిరింకపత్రాలు జారీ చేసింది. నెత‌న్యాహును చంపుతాన‌ని ఐఆర్‌జీసీ ప్ర‌క‌టించ‌గా అమెరికా ఇరాన్ తాజా సుప్రీం లీడ‌ర్ మొజ్త‌బా ఖ‌మేని చంపుతామ‌ని చెబుతుంది. ఈ ఒంటరితనం అమెరికా వ్యూహాన్ని మార్చేస్తోంది.ఉత్తర కొరియా మద్దతుతో ఇరాన్‌ ఐఆర్‌జీసీ యుద్ధం దీర్ఘకాలం సాగేలా చేస్తున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments