ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేయాలంటే చాలా మంది జ్యోతిష్య శాస్త్రాన్ని ఆధారంగా తీసుకుంటారు. అయితే ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుంది అనే సందేహం చాలామందిలో ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో సంఖ్యాశాస్త్రం ఒక ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది. మనిషి పుట్టిన తేదీని ఆధారంగా తీసుకుని వారి స్వభావం, ఆలోచనా విధానం, ప్రవర్తన, భవిష్యత్తు ధోరణి వంటి అంశాలను విశ్లేషించడానికి ఈ సంఖ్యాశాస్త్రాన్ని ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో కొన్ని అంకెలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా 1, 3, 5, 7, 9 అంకెలకు సంబంధించిన తేదీల్లో జన్మించిన వారు ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వ్యక్తులు సాధారణంగా ఇతరులను ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉండటంతో పాటు, నాయకత్వ గుణాలు ఎక్కువగా ప్రదర్శిస్తారని పేర్కొంటున్నారు.
సంఖ్యాశాస్త్రం ప్రకారం.. 1 సంఖ్యకు చెందిన వారు ఏ నెలలోనైనా 1, 10, 19, 28 తేదీల్లో జన్మిస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు సహజంగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా తక్షణ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వీరిలో కనిపిస్తుంది. నిజాయితీ, ధైర్యం వీరి ప్రధాన లక్షణాలు. ఈ గుణాల వల్ల సమాజంలో వీరికి గౌరవం, గుర్తింపు లభిస్తుంది. బాధ్యతలు తీసుకోవడంలో ముందుండే స్వభావం వీరిని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది.
3 సంఖ్య ప్రభావం కలిగిన వారు ఏ నెలలోనైనా 3, 12, 21, 30 తేదీల్లో జన్మిస్తారు. వీరిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. చమత్కారమైన మాటలు, హాస్యభరిత స్వభావం వీరి ప్రత్యేకత. చుట్టూ ఉన్న వారిని సంతోషపరచడం వీరికి సహజసిద్ధంగా వస్తుంది. కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టడంలో వీరు ముందుంటారు. అందరితో కలిసిపోయే స్వభావం వీరిని సమాజంలో ఆదరణ పొందేలా చేస్తుంది.
5 సంఖ్యకు చెందిన వారు 5, 14, 23 తేదీల్లో జన్మిస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవాలని కోరుకుంటారు. ఒకే విధమైన పనిలో ఎక్కువకాలం ఉండటం వీరికి ఇష్టం ఉండదు. మార్పులను స్వాగతించే ధోరణి వీరిలో స్పష్టంగా కనిపిస్తుంది. చురుకుదనం, చమత్కారం వీరి ప్రధాన బలాలు. తమ మాటలతో ఇతరులను ఆకట్టుకునే నైపుణ్యం వీరిని ప్రత్యేకంగా నిలబెడుతుంది.
7 సంఖ్య ప్రభావంలో జన్మించిన వారు 7, 16, 25 తేదీల్లో పుట్టుతారు. వీరిలో లోతైన ఆలోచనా శక్తి ఉంటుంది. ఏ విషయాన్నైనా పూర్తిగా విశ్లేషించి నిర్ణయం తీసుకోవడం వీరి లక్షణం. సాధారణంగా ఇతరుల కంటే భిన్నంగా ఆలోచిస్తూ తమకంటూ ప్రత్యేక మార్గాన్ని ఎంచుకుంటారు. కష్టసమయంలో కూడా ధైర్యంగా ముందుకు సాగుతారు. నిశ్శబ్దంగా ఉండే స్వభావం ఉన్నప్పటికీ, అంతర్గతంగా బలమైన ఆలోచనలతో ముందుకు సాగుతారు.
9 సంఖ్యకు చెందిన వారు 9, 18, 27 తేదీల్లో జన్మిస్తారు. వీరు ఎక్కువగా దయ, కరుణ గల వ్యక్తులుగా ఉంటారు. ఇతరుల సమస్యలను అర్థం చేసుకుని వారికి సహాయం చేయాలనే తపన వీరిలో ఉంటుంది. కష్టకాలంలో కూడా చిరునవ్వుతో సమస్యలను ఎదుర్కొనే ధైర్యం వీరి ప్రత్యేకత. భావోద్వేగాలకు దగ్గరగా ఉండే వీరు, సమాజంలో మంచి మనసున్న వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు.
Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం ఇదారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. అలాగే వీటిని క్రైమ్ మిర్రర్ అధికారికంగా దృవీకరించడం లేదు.
ALSO READ: కొత్త పథకం ప్రారంభం.. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం
