Wednesday, March 18, 2026
Homeజాతీయంతొలిద‌శ డీపీఆర్ సిద్దం : మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు

తొలిద‌శ డీపీఆర్ సిద్దం : మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు

  • అసెంబ్లీలో వాడి వేడి చ‌ర్చ‌…

హైద‌రాబాద్, క్రైమ్ మిర్ర‌ర్:  మూసి న‌దిని పున‌ర్ నిర్మించి సుంద‌రంగా తీర్చిదిద్దేందుకు ప్ర‌తిష్టాత్మ‌కంగా రేవంత్ స‌ర్కార్ చేప‌ట్టింది. కాగా మూసి పున‌ర్నిర్మాణ అంశంపై అసెంబ్లీలో అధికార‌,ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య వాడివేడి చ‌ర్చ సాగింది.ఈ సంద‌ర్భంగా మూసి న‌ది పున‌ర్నిర్మాణం తొలి ద‌శ డీపీఆర్ సిద్ద‌మైంద‌ని 1,435 నిర్మాణాలు ప్రభావితమవుతాయని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కాగాఅయితే మెయిన్‌హార్ట్ సంస్థ సామర్థ్యంపై కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేస్తూ, గెజిట్ గణాంకాలకు మంత్రి మాటలకు పొంతన లేదని అన్నారు.దీంతో ప్రాజెక్టు పారదర్శకతపై సభలో వాదోపవాదాలు జరిగాయి.

వెంట‌నే శ్రీ‌ధ‌ర్‌బాబు మాట్లాడుతూతొలిద‌శ డీ పీఆర్ సిద్ద‌మైంద‌ని తుది ఎన్యూమరేషన్ కొన‌సాగుతుంద‌ని, బ‌ఫ‌ర్ జోన్‌లో ఉన్న వారికి టీడీఆర్ ఇస్తామ‌న్నారు. 2013 చట్టం ప్రకారం భూసేకరణ, పునరావాసం ఉంటుందని అసెంబ్లీలో ప్రకటించారు. బీఆర్ ఎస్ చేప‌ట్టిన ప్రాజెక్టుల‌ను కాంగ్రెస్ ఆపేసింద‌ని తెలుప‌డం స‌రికాద‌ని మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు అన్నారు.

ఎస్టీపీలకు సంబంధించి బీఆర్‌ఎస్‌ హయాంలో 30 శాతం పనులు పూర్తికాగా కాంగ్రెస్ హ‌యాంలో 70 శాతం ప‌నులు పూర్తి అయిన‌ట్లు తెలిపారు. బీఆర్ ఎస్ చేసిన ప‌నులు చిన్న వ‌ర‌ద‌ల‌కే కొట్టుక‌పోయాయ‌ని, మురికి కాలువ‌గా ఉన్న జీవ‌న‌ది మూసిని అభివృద్ది చేయ‌డం త‌ప్పా అని ప్ర‌శ్నించారు. అభివృద్దికి అడ్డుప‌డ‌డం స‌రికాద‌ని మండిప‌డ్డారు.

18నెల‌లు అని చెప్పి రెండునెల‌ల్లోనే పూర్తి చేశారా…కేటీఆర్‌

అంతకు ముందు మాట్లాడిన కేటీఆర్ మాట్లాడారు. మూసీ న‌ది డీపీఆర్‌ తయారుచేసేందుకే 18 నెలలు పడుతుందని చెప్పి రెండు నెలల్లోనే పూర్తి చేశారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకవేళ డీపీఆర్‌ పూర్తయి ఉంటే మా ముందు పెట్టాలన్నారు. డీపీఆర్‌ మాకు ఇంతవరకు అందలేదని ఏడీబీ చెబుతుందని డీపీఆర్‌ తయారుకాకుండా తయారైందని చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైరయ్యారు.

మూసీ డీపీఆర్‌ బాధ్యతలను మెయిన్‌హార్ట్‌కు అప్పగించారని మెయిన్‌హార్ట్ సంస్థపై పాకిస్థాన్‌ ప్రభుత్వం రెడ్‌కార్నర్ నోటీసులు ఇచ్చిందని చెప్పారు. మూసీ పునర్నిర్మాణంలో 1400 నిర్మాణాలు పోతాయని మంత్రి చెబుతుంటే 10 వేల నిర్మాణాలు పోతాయని గెజిట్ చెబుతోందని అన్నారు. మంత్రి చెబుతున్నది నిజ‌మా…? ప్రభుత్వ గెజిట్‌లో చెబుతున్నది నిజ‌మా? ఏది న‌మ్మాల‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments