పెద్దల సభలోకి వెళ్లాలని సీనియర్ ఆలోచన
అన్ని రకాల పదవులు అనుభవించిన వైనం
రాజ్యసభ అండ్ గవర్నర్ పోస్ట్ కోసం ఆరాటం
చంద్రబాబు మదిలో ఏముందో?
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు గౌరవప్రదమైన పదవీ విరమణ కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వివిధ హోదాల్లో పనిచేశారు యనమల. మొన్నటి ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఆయన కుమార్తె యనమల దివ్య తుని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ శాసన సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే యనమల రామకృష్ణుడు గౌరవప్రదమైన పదవీ విరమణ కోరుకుంటున్నారు. తనకు రాజ్యసభ పదవి కానీ. గవర్నర్ పోస్ట్ కానీ ఇవ్వాలని కోరుతున్నారు. ఆ పదవి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే టిడిపి నుంచి అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కింది. అయితే ఆ జాబితాలో ఉన్నారు యనమల రామకృష్ణుడు. అయితే జూన్లో ఖాళీ కాబోయే రాజ్యసభ పదవిలో యనమల రామకృష్ణుడు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరోవైపు గవర్నర్ పోస్ట్ ఇచ్చిన తీసుకునేందుకు యనమల సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న యనమల గౌరవప్రదమైన పదవీ విరమణ కోరుకుంటున్నారు. అయితే ఆయనకు ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇచ్చేందుకు టిడిపి నాయకత్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
సీనియర్ పొలిటీషియన్
యనమల రామకృష్ణుడు సీనియర్ పొలిటీషియన్. తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 1983 ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి తుని నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారి ఆయనను ఎన్టీఆర్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 1985లో సైతం రెండోసారి గెలిచిన యనమల ఎన్టీఆర్ మంత్రివర్గంలో సభ్యుడిగా పని చేశారు. 1989 ఎన్నికల్లో యనమల గెలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అయితే అంతకుముందు మంత్రిగా తన ముద్ర చాటుకోవడంతో ఎన్టీఆర్ ఆయనకు అరుదైన ఛాన్స్ ఇచ్చారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పిఎసి చైర్మన్గా ఆయనకు చాన్స్ ఇచ్చారు. అయితే 1994 ఎన్నికల్లో యనమల గెలిచేసరికి శాసనసభ స్పీకర్గా ఛాన్స్ ఇచ్చారు ఎన్టీఆర్. అయితే 1995 టిడిపి సంక్షోభంలో కీలకంగా వ్యవహరించారు స్పీకర్ గా ఉన్న యనమల. అయితే చంద్రబాబుకు నాయకత్వం వచ్చిన తర్వాత 1999లో యనమల రామకృష్ణుడు మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టారు. 2004లో సైతం యనమల గెలిచారు. కానీ తెలుగుదేశం ఓడిపోవడంతో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారు యనమల.
2009లో తొలి ఓటమి
2009లో తొలిసారిగా ఓడిపోయారు యనమల. అక్కడ నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని భావించారు. అందుకే 2014లో ఎమ్మెల్సీగా ఉన్న యనమలను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించారు యనమల. అయితే 2019 ఎన్నికల్లో యనమల పోటీ చేయలేదు. 2024 ఎన్నికల్లో యనమల సొంత నియోజకవర్గ తుని నుంచి ఆయన కుమార్తె దివ్య ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అదే సమయంలో ఎమ్మెల్సీగా ఉన్న యనమల పదవీ విరమణ చేశారు. అయితే యనమల ఈసారి రాజ్యసభ పదవిని బలంగా కోరుకుంటున్నారు. ఆయనకు రాజ్యసభ ద్వారా పెద్దల సభలోకి వెళ్లాలన్న కోరిక బలంగా ఉంది. అదే సమయంలో గవర్నర్గా అవకాశం వస్తే వెళ్లాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు. గవర్నర్గా తెలుగుదేశం పార్టీకి చెందిన అశోక్ గజపతిరాజు కు ఛాన్స్ వచ్చింది. అయితే ఈసారి యనమలకు ఛాన్స్ వస్తుందన్న టాక్ నడిచింది. అయితే ప్రస్తుత సమాచారం మేరకు యనమలకు రాజ్యసభ పదవి కానీ.. గవర్నర్ పోస్ట్ కానీ వచ్చే అవకాశం ఉంది. చూడాలి ఆయన ఎలాంటి ఛాన్స్ దక్కించుకుంటారో?
